Rahul Gandhi: సాఫ్ట్‌వేర్లు వాడి ఓట్లు దొంగిలించారన్న రాహుల్ గాంధీ.. స్పందించిన ఈసీ

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత మరోసారి విరుచుకుపడ్డారు. సాఫ్ట్‌వేర్లు వాడి మరీ ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ, ఈసీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అదంతా అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసింది.

New Update
No deletion of any vote can be done online by any member of public, EC rejects Rahul Gandhi's claim

No deletion of any vote can be done online by any member of public, EC rejects Rahul Gandhi's claim

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత మరోసారి విరుచుకుపడ్డారు. సాఫ్ట్‌వేర్లు వాడి మరీ ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ, ఈసీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అదంతా అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసింది. అసలు ఆన్‌లైన్‌ ద్వారా ఓట్లను తొలగించడం అనేది సాధ్యమయ్యే పని కాదని పేర్కొంది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఏ ఒక్కరి ఓటు కూడా సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా తొలగించదేని తెలిపింది. ఆన్‌లైన్‌లో అసలు ఎవరూ తొలగించలేరని పేర్కొంది. 

Also Read: శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం

2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించేందుకు విఫల యత్నాలు జరిగినట్లు తెలిపింది. అంతేకాదు దీనిపై విచారణ కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసిందని చెప్పింది. 2018లో అలంద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారని.. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్‌ పాటిల్ గెలిచినట్లు ఈసీ స్పష్టం చేసింది. 

Also Read: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?

మరోవైపు బీజేపీ కూడా రాహుల్‌ ఆరోపణలను తప్పుబట్టింది. మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. ''రాహుల్ గాంధీకి రాజ్యాంగం, చట్టం గురించి తెలియడం లేదు. 2014 నుంచి ప్రధాని మోదీ సాధిస్తున్న విజయాలు నిజం కాదని అంటున్నారు. ఇలా మాట్లాడటం దేశ ప్రజలను, ఓటర్లను అవమానించినట్లేనని. రాహుల్ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానని'' అన్నారు.  ఢిల్లీ మంత్రి మజీందర్ సింగ్ సిర్సా కూడా దీనిపై స్పందించారు. ''హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అంటోంది. బాంబు ఇలానే ఉంటుందా ?. వాళ్లు ఓడిపోతున్నారు. ఈ సమయంలో వాళ్లు ఓటమిని అంగీకరించాలి. కానీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని'' విమర్శించారు. 

Also Read: ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు

మరో బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌ మాట్లాడుతూ బంగ్లాదేశ్, నేపాల్‌ తరహాలో భారత్‌లో అశాంతి సృష్టించాలని రాహుల్ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయిందని ఆరోపించారు. అందుకే రాహుల్‌కు రోజురోజుకు అసహనం పెరుగుతోందంటూ సెటైర్లు వేశారు. క్షమాపణలు అడగడం, కోర్టు మందలింపుుల అనేవి ఆయనకు పరిపాటిగా మారిపోయినట్లు విమర్శించారు.  

Also Read: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

Advertisment
తాజా కథనాలు