/rtv/media/media_files/2025/06/16/EMG4ml3aM6FFdfKB3kZe.jpg)
KTR
Election Commission: జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
Also Read : నేనేంటో అందరికీ తెలుసు.. కొండా సురేఖతో విభేదాలపై పొంగులేటి సంచలన కామెంట్స్!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అవుతోందని దేశమంతా గగ్గోలు పెడుతుంటే .., జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ నేతలే ఓటు చోరీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లని ఈ మధ్యకాలంలోనే సృష్టించారని ఆయన ఆరోపించారు. ఒక ఇంటి పేరుతోనే 43 ఓట్లు సృష్టించారని కేటీఆర్ తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తూ ఫిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని.. ఇలా చెప్పుకుంటూ పోతే 20 వేల దొంగ ఓట్లను కాంగ్రెస్ వారు సృష్టించారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
కింది స్థాయి అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని కేటీఆర్ మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరారు.
Also Read : జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల కలకలం.. ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!