Narsing Barber Incident: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం చోటుచేసుకుంది. రాజు (50) అనే బార్బర్‌ను మరో బార్బర్ ప్రవీణ్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్ లో వారి ఇళ్ల ముందు ముగ్గులు వేసే విషయంలో ఇరువురికి తగాదాలు వచ్చాయని తెలిపారు. ఇంటి ముందు ముగ్గును చెడిపేశాడని రాజుతో ప్రవీణ్ గొడవ పడ్డాడాడని చెప్పారు. అప్పట్లో రాజు నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే.. ఆ సమయంలో పెద్దలు సర్ది చెప్పి కేసు వాపసు చేయించారన్నారు. అప్పటి నుంచి వీరిమధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. ఈ ఇద్దరు వరుసకు బంధువులు అవుతారని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.
crime news
TS: నా ప్రియురాలు లేకుండా ఉండలేకపోతున్నా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టి యువకుడి సూసైడ్!
Sangareddy: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మూడు రోజుల కిందటే శ్రీహరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్చించారు. అయితే, ఆస్పత్రి నుంచి గత రాత్రి శ్రీహరి పరార్ అయ్యాడు. తెల్లవారుజామున చూసే సరికి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
Also Read: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ!
చనిపోయే ముందు ఇన్‌స్టాలో శ్రీహరి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే సూసైడ్ నోట్‌గా భావించాలని.. తనది వన్ సైడ్ లవ్ కాదని.. ఒకరినొకరు ప్రేమించుకున్నాని పోస్ట్ చేశాడు. తేజస్విని చావుకు ఆమె తండ్రి, రాజురెడ్డి అనే బీజేపీ లీడరే కారణమని పోస్ట్ లో పేర్కొన్నాడు. ‘తేజస్వి లేకుండా ఉండలేకపోతున్నా.. తన దగ్గరికే వెళ్తున్నా.. అక్క.. అమ్మని బాగా చూసుకో..చనిపోయాక అయినా మాకు న్యాయం చేయండి.. నిందితులను కఠినంగా శిక్షించండి’ అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Also Read: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!
కాగా, గుమ్మడిదలకు చెందిన బీఫార్మసీ విద్యార్థి తేజస్వికి..ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీహరి పరిచయమైయ్యాడు. అయితే, శ్రీహరి వేధింపులతో విద్యార్థిని తేజస్వి ఆత్మహత్య చేసుకున్నడని ఆమె కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తేజస్వి తల్లిదండ్రులు శ్రీహరిపై పోలీసులు ఫిర్యాదు చేయగా గుమ్మడిదల పీఎస్‌లో అతడిపై కేసు నమోదైంది. భయంతో మూడు రోజుల కిందట శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా గత రాత్రి ఆసుపత్రి నుంచి పరార్ అయ్యాడు. శ్రీహరి కనిపించడం లేదంటూ సూరారం పోలీస్ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేయగా.. సాయినాథ్ సొసైటీ నిర్మాణ ప్రాంతంలో శ్రీహరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!
Kolkata Trainee Doctor Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంచలనం నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ (Sanjay) మొదట ఆమెను హత్య చేసి ఆ తర్వాత రేప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె పెదవులు, కళ్లు, గోళ్లు, మెడ, కడుపు, నాభి, నోరు, కుడి చేయి, ఎడమ కాలుపై తీవ్రమైన గాయాలుండటంతోపాటు రక్తస్రావం అయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్ పట్ల ఆ దుర్మార్గుడు క్రూరంగా ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మర్మాంగంనుంచి కూడా చాలా రక్తం కారినట్లు చెప్పారు. ఆమె కేకలు వేస్తుండగా మొదట తలను బలంగా గోడకు కొట్టాడని, దీంతో ఆమె మూర్చపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాలతోనే ముందుగా యువతిని చంపి, ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు అంచనా వేశామని పోలీసులు చెబుతున్నారు.
చెడు అలవాట్లకు బానిసై..
ఇక ఈ మర్డర్ చేసిన సంజయ్ ఇంటికి వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా పడుకున్నట్లు చెప్పారు. ఆ మరుసటి ఉదయం తన బట్టల మీద రక్తపు మరకలు లేకుండా ఉతికేసుకున్న సంజయ్.. షూలను శుభ్రం చేయడం మరిచిపోగా వీటి ఆధారంగానే సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ చాలా రోజుల నుంచి మద్యానికి అలవాటు పడి, చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని, అతని జీవనం విధానం నచ్చకపోవడంతో ముగ్గురు భార్యలు విడిచిపెట్టడంతో నాలుగో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హింసాత్మక పోర్న్ కంటెంట్..
అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని నుంచి మరింత డేటాను రాబడుతున్నారు. ‘మేము అతని ఫోన్ నుంచి పూర్తి డేటాను బయటకు తీస్తాం. దర్యాప్తు చేస్తున్న సిబ్బంది నుంచి వాంగ్మూలాలను సేకరించాం. నిందితుడు అశ్లీల చిత్రాలకు అలవాటు పడ్డాడు. అతని మొబైల్ ఫోన్లోని అశ్లీల కంటెంట్ చాలా హింసాత్మకంగా ఉంది. అదే అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది. అలాంటి వాటిని చూడటం అసహజంగా అనిపిస్తోంది’ అని పోలీసు అధికారి వివరించారు.
ఇది కూడా చదవండి: AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!
మరోవైపు సంజయ్ ను కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని వాదిస్తోంది. పోలీసుల ఒత్తిడితోనే చేయని నేరం అంగీకరించాడని చెబుతోంది. ఇక ఆగస్టు 18 లోగా పోలీసులు కేసును చేధించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Murder: ప్రేమించి పెళ్లాడిన భార్యను కిరాతకంగా చంపిన భర్త!
AP News: ఏపీలోని అల్లూరి జిల్లా అరకులోయలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. మొదటి భార్య, పిల్లలు ఉండగానే ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న రెండవ భార్యను తలపై మోది దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మేరకు డుంబ్రిగూడ మండలం కించుమండ గ్రామానికి చెందిన నిందితుడు రాజ్ కుమార్ మండలంలోని పోతంగి పంచాయతీ బల్లుగుడ గ్రామానికి చెందిన బంగారు దేవిని ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అకారణంగా కుటుంబంలోని చిన్న చిన్న తగాదాలకు కోపోద్రిక్తుడైన రాజకుమార్ మూడు రోజుల క్రితం తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ మేరకు భార్య తరఫున నమోదైన కేసును ఆధారంగా సిఐ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో డుంబ్రిగూడ ఎస్సై, ఇతర పోలీసులు, నిందితుడు ఈ ఉదయం స్థానిక జైపూర్ జంక్షన్ వద్ద ఉన్నాడని తెలిసి వలవేసి పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితునిపై అత్యా నేరం నమోదు చేసి రిమైండర్ కు పంపుతున్నట్లు సీఐ రుద్ర శేఖర్ తెలియజేశారు.
Telangana: విషాదం.. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని
హనుమకొండలోని వైబ్రంట్ కాలేజ్ హాస్టల్లో విషాదం చోటుచేసుంది. ఎనుముల భవాని అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. భవాని స్వస్థలం ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం. ప్రస్తుతం ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణలు ఇంకా తెలియలేదు.
Also Read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్ వర్తింపజేయాల్సిందేనా ?
మరోవైపు భవాని ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కళాశాలలోని ఫర్నీచర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. భవాని మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..!
Accident: బస్సును ఢీ కొట్టిన ఇన్నోవా కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి!
Shamirpet Road Accident: అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలై, పరిస్థితి విషమంగా ఉంది.
బస్సులో ప్రయాణిస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు రోడ్డు దిగువకు వెళ్లి, ఆగిపోవడంతో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది.ఈ యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డయ్యింది.
గజ్వేల్ నుంచి హైదరాబాద్ కారు వస్తున్నక్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని 10 మంది ఉద్యోగులు, బైకర్ శుబిదాస్కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.