Tantric Ritual: బెంగళూరులో దారుణం...కుక్క రక్తంతో క్షుద్రపూజల కలకలం

బెంగళూరులోని మహదేవ్ పుర పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేకపోవడం వల్లనో, మరేదైనా కారణం చేతనో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు.  

New Update
Occult rituals with dog blood

Occult rituals with dog blood

Tantric Ritual:  అది బెంగళూరులోని మహదేవ్ పుర పోలీస్ స్టేషన్‌ పరిధి...అక్కడి ఒక ఇంటినుంచి ఒకటే దుర్వాసన..ఇంటికి తాళం వేసి ఉండటంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. కుళ్ళిన వాసన వస్తున్నట్లు గుర్తించిన పొరుగువాళ్లు గమనించి, బెంగళూరు పౌర సంస్థ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే)కి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన  సదరు మున్సిపల్ అధికారులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఒక గుడ్డలో కుళ్లిన కుక్క మృతదేహాన్ని గుర్తించారు. అంతేకాదు అక్కడ  కొన్ని అనుమానాస్పద వస్తువులు,అనేక మతపరమైన చిత్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో ఇదేదో ఒక 'తాంత్రిక' పూజ నిర్వహించి ఉంటారని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

Also Read: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు

Occult Rituals With Dog Blood Abound

అయితే ఆ ఇంటిలో ఒక యువతి ఉండేదని పొరుగువాళ్లు చెబుతున్నారు.  నిందితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందినామె అని, బెంగళూరులో నివసిస్తుందని చెబుతున్నారు. మతిస్థిమితం లేకపోవడం వల్లనో, మరేదైనా కారణం చేతనో ఆ యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు.   ఆ యువతి నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కన ఉన్న నివాసితులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!
 
సదరు యువతి వారం క్రితమే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. చంపిన కుక్క రక్తంతో ఆ యువతి 'తాంత్రిక' పూజలు నిర్వహించినట్టు ఇంటిలోని పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుందని పోలీసులు అంటున్నారు. ఆ మహిళకు మూడు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని చంపి క్షుద్రపూజలు జరిపినట్టు మున్సిపల్, పోలీస్ అధికారులు భావిస్తున్నారు. మిగతా రెండు కుక్కలు ఇంటిలోని గోడకు కట్టి ఉన్నాయి. ఆ కుక్కలను స్వాధీనం చేసుకున్న అధికారులు BMP ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ యువతిపై మహదేవ్ పుర పోలీస్ స్టేషన్‌లో జంతు హింస, సంబంధిత సెక్షన్ల కింద పోలీసులుకేసు నమోదు చేశారు. ఈ భయంకరమైన పనికి క్షుద్రపూజ నేపథ్యమా లేక నిందితురాలి మానసిక స్థితి సరిగా లేకపోవడం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  రోడ్డు పక్కన బుట్టలో నవజాత శిశువు.. లేటర్‌లో ఏం రాశారంటే ?

Also Read :  ఇవి మీకు కలలో కనిపించాయా.. కోట్లు మీ సొంతం

rituals | blood | youth | dog | crime news | bengaluru

Advertisment
Advertisment
తాజా కథనాలు