TG Crime : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి...కార్పొరేటర్‌ వద్ద పనిచేస్తూ...

బహదూర్‌పురాలో వాచ్‌మెన్ ఓ వాచ్‌మెన్‌ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతను ఓ కార్పొరేటర్‌ దగ్గర పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన దారుణహత్యకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బహదూర్‌పురాలో సంచలనం సృష్టించింది.

New Update
murder

murder

TG Crime : బహదూర్‌పురాలో ఓ వాచ్‌మెన్‌ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతను ఓ కార్పొరేటర్‌ దగ్గర పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన దారుణహత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన బహదూర్‌పురాలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురా కార్పొరేటర్ హుస్సేన్ పాషా వద్ద ఇస్మాయిల్ (34) అనే వ్యక్తి గత కొంతకాలంగా వాచ్ మన్‌గా పనిచేస్తున్నాడు.  ఆదివారం రాత్రి కార్పొరేటర్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను బహదూర్‌పురా ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద అనుమానస్పందంగా మరణించాడు. అయితే అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఫలక్‌నుమా ఏసీపీ జావీద్, ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెయాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు