TG Crime : వరకట్న వేధింపులకు మరో మహిళ బలి

హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు మరో  మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయికి ఏడాదిన్నర క్రితం శరత్‌ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో  శరత్‌కు  రూ.3లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా కట్నం కావాలని వేధించడంతో గుండెపోటుతో మరణించింది.

New Update
suicide

Another woman falls victim to dowry harassment

TG Crime : హైదరాబాద్‌లో వరకట్న వేధింపులకు మరో  మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయికి ఏడాదిన్నర క్రితం శరత్‌ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో  శరత్‌కు  రూ.3లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. గత డిసెంబర్‌లో బైక్‌ ఇస్తామన్నారు. అయితే దానితో సంతృప్తి చెందని శరత్‌ అదనపు కట్నం తేవాలని, బంగారం తీసుకురావాలని భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకుని కుమిలిపోయింది. ఈ విషయమై అల్లుని కుటుంబ సభ్యులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం

ఇదిలా ఉండగా  ఇటీవల మరోసారి కట్నం డబ్బులు తీసుకురావాలని శరత్‌ మరోసారి  దాడి చేయడంతో కిరణ్మయి పుట్టింటికి వచ్చింది.  జరిగిన విషయం ఇంట్లో వాళ్లకి చెప్పింది. ఈ విషయంలో కిరణ్మయి తీవ్ర మానసిక వేధనకు గురైంది. మరోవైపు భర్త కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఆమెకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిరణ్మయి ఆదివారం  రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు శరత్‌పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. కిరణ్మయి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read :  ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!

Advertisment
Advertisment
తాజా కథనాలు