KCR On Rythu Bandhu : మహిళల బిందెలు పట్టుకుని నీళ్ల కోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR). రాష్ట్రంలో నీటికోతలు ఎందుకు ప్రారంభమయ్యాయని రేవంత్ సర్కార్(Revanth Sarkar) ను నిలదీశారు.సూర్యపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ప్రసంగించారు. ప్రభుత్వా విధాలనపై ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ ఎస్ పాలనలో అద్భుతంగా ఉండి.. ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్న తెలంగాణ(Telangana) రాష్ట్రం..ఇంత అనతి కాలంలోనే ఎందుకు ఈ బాధగురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రశ్నించారు. దీనికి కారణాలేంటి ..ప్రపంచ దేవాలు యూఎన్ఓ 15నుంచి16 రాష్ట్రాలు కొనియాడి అమలుచేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత ఏర్పడింది. సీఎస్ లో అన్ని విషయాలు బారాబరి ఉన్నాయి..ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్(Hyderabad) నగరంలో రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి… 20వేల లీటర్ల ఉచిత నీరు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీరు అందించాం. దీనికి జర్నలిస్టులే సాక్షం అన్నారు కేసీఆర్. దానిలో ఎందుకు లోపం వస్తుంది కారణం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో చాలెంజ్ చేశామన్నారు. నేను స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని.. ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశామని సంగతి కేసీఆర్ గుర్తు చేశారు.
ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపామని… బిందెపట్టుకొని ఆడబిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదన్నారు కేసీఆర్. ఇప్పడన్నీ మామయ్యాయి. మంచినీళ్లు ట్యాంకర్లు ఐదుసంవత్సరాల్లో కనిపించలేదన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్లీ బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్ అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుందన్నారు. ఇవీ ఆలోచించాల్సిన విషయాలంటూ కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : 100రోజుల్లో రెండు వందల మంది రైతుల బలవన్మరణం :కేసీఆర్