Cm Revanth Reddy: నేను వస్తున్నా.. సీఎం రేవంత్ సంచలన ట్వీట్!

తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని అన్నారు. ఒక్క ఏడాదిలో రూ. 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నామన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్!

“మార్పు” కోసం...

సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో..." ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రూ.7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్, రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్, రూ.1433 కోట్ల రైతుబీమా, రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం, రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు…
రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా." అని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు