Minister Sridhar Babu: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం

రాష్ట్రంలో అత్యుత్తమ MSME పాలసీ తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు చేయడం అభినందనీయని తెలిపారు. బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేస్తామని చెప్పారు.

New Update
Sridar babu

మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యుత్తమ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) పాలసీ తీసుకొచ్చామని
 తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు చేయడం అభినందనీయని పేర్కొన్నారు. బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో టీహబ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. '' మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది. అత్యుత్తమ ఎంఎస్‌ఎంఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చాం. 

Also Read: ఫడ్నవిస్‌కు బిగ్ షాక్.. మహారాష్ట్ర సీఎంగా కేంద్రమంత్రికి ఛాన్స్

విధానాలను ఆచరణలో పెట్టడమే ఇప్పుడు పెద్ద సవాల్. సమ్మిళిత అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలనేదే మా ప్రభుత్వ విధానం. ఉపాధి కులాలవారీగా అందాలనే ఉద్దేశంతోనే కులగణన చేస్తున్నాం. ఎన్ని సవాళ్లు వచ్చినా కూడా అధిగమిస్తున్నాం. సవరణ అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటాం. అలాగే బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు కూడా చేస్తాం.  

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

వివిధ బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తాం. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో పరిశ్రమలు విస్తరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని'' మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.  

Also Read: యుద్ధం ఆగాలంటే అది జరగాలి.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

Advertisment
తాజా కథనాలు