Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతులకు అందించే పెట్టుబడి సాయంలో టెక్నాలజీని ఉపయోగించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా రైతుల నుంచి దరఖాస్తులు సేకరించడంతోపాటు ప్రత్యేక వెబ్సైట్లేదా యాప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్సబ్కమిటీ సమావేశమవగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కీలక సూచనలు చేశారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనుండగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన విధివిధానాలను కార్యరూపం దాల్చేందుకు కేబినెట్సబ్కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రైతు భరోసా కావాలంటే అప్లికేషన్ తప్పనిసరి..
అయితే రైతు భరోసా కావాలనుకునేవారు అప్లికేషన్లుచేసుకోవాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్, ఫోన్నంబర్తోపాటుఊరు, మండలం, జిల్లా వివరాలతోకూడాని ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సులభంగా ఉంటుందని సబ్ కమిటీ చర్చలు జరిపింది. ఇందులో భాగంగానే ప్రత్యేక వెబ్‌సైట్, యాప్ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయనేతలు, ప్రభుత్వ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అనేది బయటపడుతుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు రైతు బంధు కోసం పెట్టిన ‘గివ్ ఇట్ అప్’ వల్ల ప్రయోజనం లేదని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్
రెండు దశల్లో వెరిఫికేషన్..
ఇక దరఖాస్తు చేసుకున్న భూముల్లో గుట్టలు, రోడ్లు, చెరువులు, గవర్నమెంట్ భూములకు సంబంధించి గుట్టు బయటపడనుంది. ఆ భూములను అగ్రికల్చర్నుంచి తొలగించి నోషనల్ఖాతాలోకి తర్జుమా చేసే అవకాశం కూడా ఉంది. అందుకే రైతుల నుంచి అప్లికేషన్ వచ్చిన తర్వాత సీసీఎల్ఏలోని డేటాను పరిశీలించి అక్రమాలు చోటుచేసుకోకుండా చూడొచ్చని ఆలోచిస్తున్నారు. రెండు దశల్లో వెరిఫికేషన్నిర్ధారించి సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్సబ్కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాగు చేసిన భూమిని మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్వెరిఫికేషన్, శాటిలైట్సర్వేను వాడుకలోకి తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి: Cricket: కాబోయే కెప్టెన్ నితీష్‌రెడ్డినే.. చాముండేశ్వరీనాథ్ సంచలనం!
గత ప్రభుత్వం 2018–19, 2022–2023లో రూ.22,600 కోట్ల నిధులు సాగు చేయని భూములకు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. సాగు భూములకే రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం పక్కదారి పట్టదని భావిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చితీరుతుందని సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయం, వ్యవసాయంతో సంబంధమున్న రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించినట్లు భట్టి చెప్పారు. రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు.