Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ముహుర్తం ఈ నెలాఖరునే!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది..

New Update
TS Govt: ప్రభుత్వం నిర్ణయం.. ఓడిలు రద్దు, రవాణా శాఖ అధికారుల బదిలీలు

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్‌ మొదటివారంలోనైనా జాబితా రూపొందించాలని కృతనిశ్చయంతో ఉంది. 

Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్‌ సర్కార్‌ అదిరిపోయే ఆఫర్‌!

వాస్తవానికి ఈ నెల  15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్‌ లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్‌ తో సరిపోలకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు.

Also Read: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!

ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే ఈ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. అవన్నీ ఈ వారంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతంఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

Also Read: AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు!

అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గతంలో గృహ లబ్ధిపొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని గుర్తించారు. లబ్దిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !

లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలనూ నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్‌ సైట్‌ లో నమోదు చేయాల్సి ఉంటుంది. 

స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్దిదారు ఇంటిని నిర్మించుకోవాలి. ప్రభుత్వం నాలుగు దశల్లో రూ. 5 లక్షలు చెల్లిస్తోంది.

రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.28 వేల కోట్లతో 20 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.7,70 కోట్లు ఖర్చు చేయనుంది. గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌ లో స్థలం లేనివారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని భావిస్తోంది.

అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు  23, 85,188 మంది లబ్దిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల్లో ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 19, 32,001 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. 4,53,187 ఇళ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

2014 నుంచి 2023 డిసెంబర్‌ 7 వరకు 2,36,711 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1,58,860 ఇళ్లు పూర్తయ్యాయి. వీరిలో 1,36,116 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు