Holi Celebration: ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ వీడియో ఫుల్ మీల్స్.. డోంట్ మిస్

సచిన్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్‌ అందరూ హోలీ వేడుకలు చేసుకున్నారు. గదిలో నుంచి యువరాజ్ సింగ్‌ను బయటకు రప్పించి మరీ రంగులు చల్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. టీమిండియా మాజీ ప్లేయర్లందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

New Update
Sachin holi

Sachin holi Photograph: (Sachin holi)

ఇండియన్ మాస్టర్స్ లీగ్‌ (Indian Masters League) సెమీఫైనల్‌లో ఇండియా టీం (India Team) విజయం సాధించిన తర్వాత హోలీ సంబరాలు చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ మార్చి 16న (ఆదివారం) జరగనుంది. సెమీ ఫైనల్ గెలుపును, హోలీని కలపి సెలబ్రేట్ చేసుకున్నారు.  సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్‌ అందరూ కలిసి హోలీ ఆడాడు. యువరాజ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో తన జట్టును ఆస్ట్రేలియాపై 94 పరుగుల తేడాతో అద్భుతమైన విజయానికి నడిపించి IML ఫైనల్‌కు చేరుకుంది. దీంతో యువరాజ్‌పై బ్యాటింగ్‌ను ప్లేయర్స్ మెచ్చకున్నారు. 

Also Read :  కృతజ్ఞత లేకుండా బతకొద్దు.. నాగబాబుకు బండ్ల గణేష్ కౌంటర్!

Also read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Yuvraj Singh Gets Holi Surprise 

తన గదిలో ఉన్న యువరాజ్ సింగ్‌ (Yuvaraj Singh) కు సచిన్, యూసఫ్ పఠాన్, రాయుడు బలవంతంగా రంగులు చల్లారు. నీళ్లు కూడా పోశారు. అందరూ కలిసి యూవరాజ్‌ను రంగులతో నింపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన క్రికెట్ అభిమానుల కళ్లసంబరంగా ఫీల్ అవుతున్నారు. టీమిండియా మాజీ ప్లేయర్లను అందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్టర్ సచిన్ చిల్ అవుతూ అందరితో సరదగా హోలీ ఆడారు. 

Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి

Also Read :  మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్‌..41 దేశాల పై ..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు