Donald Trump: మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్‌..41 దేశాల పై ..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.

New Update
Donald Trump

Donald Trump

ఉద్యోగాల కోతలు, దేశాల పై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు  తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాల పై ట్రావెల్‌ బ్యాన్ (Travel Ban) విధించే అంశాన్ని ట్రంప్‌ సర్కార్‌ పరిశీలిస్తున్నారట.41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.

Aslo Read: Ap Temperature: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌.. ఏకంగా 43 డిగ్రీల ఎండ

ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు బయట పెడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్‌ మెమో బయటికొచ్చింది.అందులో మొత్తం  ఈ 41 దేశాలను మూడు గ్రూపులుగా విభజించినట్లు సమాచారం. పది దేశాలతో ఉన్న మొదటి గ్రూప్‌ లో ఆఫ్గానిస్థాన్‌, ఇరాన్, సిరియా, క్యూబా,ఉత్తరకొరియా వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Holi colours: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Trump Considering Travel Ban

ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారట. ఇక రెండో గ్రూప్‌ లో ఇరిట్రియా, హైతీ, లావోస్‌, మయన్మార్‌, దక్షిణ సూడాన్ దేశాలున్నాయి. వీటి పై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారని ఆ మెమోలో పేర్కొన్నారు. ఈ దేశాలకు పర్యటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి.

మూడో గ్రూప్‌ లో పాకిస్థాన్‌, బూటాన్‌ సహా 26 దేశాలు ఉన్నాయని సమాచారం. ఈ దేశాల 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయకపోతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని యూఎస్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. ప్రస్తుతానికి ఈ జాబితాను అమెరికా మీడియా సంస్థలు ప్రచారం చేయగా.. ఇందులో మార్పులు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాత దీని పై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. 

Also Read:Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Also Read:Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు