Ambati: వైసీపీ సర్కార్ పై అంబటి హాట్ కామెంట్స్.. యువత అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వాళ్లే రావాలి..!
గుంటూరు జిల్లా నందివెలుగులో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరపున మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజరికం, బానిసత్వం తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.