/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jobs-jpg.webp)
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో మార్చి 9వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 9 నుంచి 13వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెప్పోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ శ్రీవారు పుష్కరిణిలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Also Read:Horoscope Today: నేడు ఈ రాశి వారికి బాగా కలిసివస్తుంది...ఏది పట్టుకున్న బంగారమే!
తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజున సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై విహరించనున్నారు. శ్రీవారి పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు అభయప్రదానం చేస్తారని పండితులు వివరించారు. ఇక రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. మూడోరోజైన మార్చి 11వ తేదీ మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహారించి భక్తులకు అనుగ్రహమివ్వనున్నారు.
Also Read: MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
ఆర్జిత సేవలు రద్దు...
అలాగే నాలుగోరోజైన మార్చి 12వ తేదీన మలయప్పస్వామి ఐదు చుట్లు పుష్కరిణిలో విహరించనున్నారు. చివరి రోజైన మార్చి 13న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.మరో వైపు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సందర్బంగా టీటీడీ ఆర్జిత సేవలు రద్దు చేసింది. మార్చి 9వ తేదీ నుంచి ఐదు రోజులపాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10 తేదీలలో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలియజేసింది.