Mauritius:మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ అరెస్ట్‌!

నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన భార్యను కూడా అరెస్ట్ చేశారు.ఆమెను తరువాత విడిచిపెట్టారు. కానీ ప్రవింద మాత్రం ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.

New Update
praminda

praminda

నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర అనుమానితుల ఇళ్లల్లో రైడ్లు జరిపి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య కోబితను ప్రశ్నించేందుకు శనివారమే వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

కొన్ని గంటల పాటు వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత కోబితను విడుదల చేసినప్పటికీ ప్రవింద్ జగన్నాథ్‌ను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచారు. ‘‘తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ప్రధాని ఖండించినట్టు ఆయన తరపు లాయర్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వాదనను పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. త్వరలో ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.

Also Read: MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

లగ్జరీ చేతి గడియారాలు...

ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా మాజీ ప్రధాని, ఆయన భార్య పేర్లు ఉన్న కొన్ని దస్త్రాలను సీజ్ చేశామని తెలిపారు. పలు లగ్జరీ చేతి గడియారాలు, వివిధ దేశాల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

2017-24 మధ్య కాలంలో ప్రవింద్ మారిషస్‌కు ప్రధానిగా చేశారు. మారిషస్ రాజకీయాల్లోని ప్రముఖ కుటుంబాల్లో ప్రవింద్ కుటుంబం కూడా ఒకటి. బ్రిటన్ నుంచి 1968లో స్వాతంత్ర్యం పొందిన అనంతరం మారిషస్ మంచి అభివృద్ధి సాధించింది.ఇక ప్రవింద్ హయాంలో బ్రిటన్ ఛాగోస్ ఐల్యాండ్‌ను మారిషస్‌కు అప్పగించింది. అయితే, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో నవీన్ రామ్‌గులామ్ విజయం సాధించి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.

కాగా, ఛాగోస్‌కు సంబంధించి మరింత పరిహారం కోరుతూ మారిషస్ మరోసారి బ్రిటన్‌తో చర్చలు ప్రారంభించింది. అయితే, ఈ అంశంపై తుది నిర్ణయం అమెరికా ప్రభుత్వానిదేనని బ్రిటన్, మారిషస్ పేర్కొన్నాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో ముఖ్యమైన మిలిటరీ స్థావరంగా ఉన్న ఈ ద్వీప సముదాయాన్ని బ్రిటన్ అమెరికాకు అద్దెకు ఇచ్చింది.

Also Read: VIRAL VIDEO: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!

Also Read:Thandel Collections: ఇప్పుడు వేయండ్రా విజిల్స్.. నాగ చైతన్య ‘తండేల్’ కలెక్షన్స్ చూస్తే షాకై షేకైపోతారు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు