Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్‌!

ప్రయాగ్ రాజ్‌ లో కొనసాగుతున్న కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు భక్తులు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది.

New Update
Mahakumbh Mela

Mahakumbh Mela

ప్రయాగ్ రాజ్‌ లో కొనసాగుతున్న కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు భక్తులు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులుతీరగా..అటు రైల్వేస్టేషన్లూ కిక్కిరిసిపోతున్నాయి.

Also Read: Mauritius:మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ అరెస్ట్‌!

రద్దీ నియంత్రణ చర్యలు...

ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది.రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్‌ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్‌ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

Also Read: Special Trains: చేతులు కాలాక ఆకులు..తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక నిర్ణయం

మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తుండడంతో యూపీ రహదారులు,రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఆ ప్రదేశాల్లో సాధారణ పోలీసులతో పాటు జీఆర్పీ,ఆర్పీఎఫ్‌ బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు.

ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తో పాటు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, అయోధ్య, కాన్పూర్‌, లఖ్‌నవూతో పాటు మిర్జాపూర్‌ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రైలు ప్లాట్ ఫామ్‌ మీదకు వచ్చే వరకూ ప్రయాణికులను అనుమతించడం లేదు.స్టేషన్‌ బయటే రద్దీని నియంత్రిస్తున్నారు.

స్టేషన్‌ సమీప ప్రాంతాల్లోనూ వాహనాలను అనుమతించడం లేదు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లను పెట్టి నిలువరిస్తున్నారు. రైలువచ్చే ప్లాట్‌ఫామ్‌ కు సంబంధించి ఏదైనామార్పులు ఉంటే..గంటన్నర ముందే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. అయోధ్య రైల్వే స్టేషన్‌ కు నిత్యం సుమారు లక్షన్నర ప్రయాణికులు వస్తున్నట్లు అంచనా. వీరి కోసం ప్రత్యేక ప్రవేశ,నిష్క్రమణ దారులను ఏర్పాటు చేస్తున్నారు.

అటు ఢిల్లీ రైల్వే స్టేషన్‌ లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్‌  రాజ్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు.రెగ్యులర్‌ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ఆ ప్లాట్‌ఫామ్‌ ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.

ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మోద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 139కి ఫోన్‌ చేయాలని సూచించారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌ కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 52.83 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపింది.

Also Read:Thandel Collections: ఇప్పుడు వేయండ్రా విజిల్స్.. నాగ చైతన్య ‘తండేల్’ కలెక్షన్స్ చూస్తే షాకై షేకైపోతారు!

Also Read: VIRAL VIDEO: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!

Advertisment
తాజా కథనాలు