/rtv/media/media_files/2025/01/25/1OMq4QlbeytD7eXzGRTr.jpg)
Horoscope Today
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కీలకమైన విషయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు నడిస్తే విజయం ఉంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
Also Read: Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్!
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. మీ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. సమావేశాలలో, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొని బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి.
Also Read: Mauritius:మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ అరెస్ట్!
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వశక్తిని నమ్ముకుంటే మంచిది. ఎవరిపై ఆధారపడొద్దు. వృత్తి వ్యాపారాలలో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది.
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అపారమైన విజయాలను అందుకుంటారు. వృత్తి పరంగా ఎదగడానికి పాత పరిచయాలు పనికొస్తాయి. సమావేశాలు, చర్చలలో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. లక్ష్యసాధనలో ఆటంకాలు చికాకు పెడతాయి. మనోబలం కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. సహనంతో ఉంటే అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆర్థికపరంగా సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా సమయాన్ని గడపవచ్చు. ప్రయాణం అనుకూలం.
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశముంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. కుటుంబ విషయాల పట్ల సహనంతో మెలగాలి. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం ఉంది.
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన సమావేశాలు, చర్చలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముంది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలలో పురోగతి లోపిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం సూచన ఉంది. దైవారాధన వీడవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముందుచూపుతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యసాధనలో ఏకాగ్రత లోపించకుండా చూసుకోండి. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది.
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యూలేషన్లు, పెట్టుబడులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఈ రోజు మంచి రోజు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు చేపడతారు.
Also Read: CM Revanth: కలెక్టర్లకు చురకలంటించిన సీఎం రేవంత్