Prithvi Shaw: వారితో స్నేహమే నా కెరీర్ ను దెబ్బతీసింది: పృథ్వీ షా

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.

New Update
prithvi

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ పృథ్వీ తన కెరీర్ దెబ్బతినడానికి కారణం తప్పుడు స్నేహాలేనని చెప్పాడు. తప్పుడు వ్యక్తులతో తిరగడం వల్లే తాను దారితప్పానని, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అంతేకాదు ఆటపై దృష్టిపెట్టకపోవడానికి గల కారణం తన తప్పిదాలేనని ఓపెన్ అయ్యాడు. 

Also Read :  కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !

Prithvi Shaw Reveals Career Failure Reasons

Also Read :  తల్లిని చంపేందుకే లవ్ ట్రాక్.. చిన్నప్పటినుంచి పగతో రగిలిపోయిన అంజలి కూతురు!

ఈ మేరకు తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీషా మాట్లాడుతూ.. ‘నా లైఫ్ లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. నేను క్రికెట్‌కు తక్కువ సమయం కేటాయిస్తున్నానని ఆలస్యంగా అర్థమైంది. 2023 వరకు రోజులో సగం సమయం గ్రౌండ్‌లోనే గడిపేవాడిని. కానీ, ఆ తర్వాత నుంచి కొన్ని చెత్త విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను. కొంతమంది తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశా. మనం టాప్‌లో ఉంటే చాలామంది మన దగ్గరకు వస్తారు. అదే నన్ను ట్రాక్‌ తప్పేలా చేసింది' అని చెప్పుకొచ్చాడు. 

Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

అలాగే తన కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయని, తాతయ్య చనిపోవడంతో ఒత్తిడికి లోనైనట్లు చెప్పాడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణంతో కుంగిపోయా. ఆ తర్వాత చాలా జరిగాయి. అవన్నీ నేను చెప్పలేను. నా తప్పులను అంగీకరించాను. ఆ సమయంలో మా నాన్న నాకు అండగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారంటూ మనసులో మాట బయటపెట్టారు. 

Also Read :  అన్న పేరు చెప్పకుండా.. ' కన్నప్ప' టీమ్ కి మనోజ్ ఆల్ ది బెస్ట్!

 

prithvi-shaw | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news | team-india

Advertisment
Advertisment
తాజా కథనాలు