Manchu Manoj: మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణులు మధ్య కొద్దిరోజులుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ అన్న మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రేపు 'కన్నప్ప' విడుదల కానున్న నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో మనోజ్.. మంచు విష్ణు పేరును ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం వీరిద్దరి మధ్య విభేదాలను మరింత స్పష్టం చేసింది.
Also Read: Kannappa: ఏపీలో 'కన్నప్ప' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్! ఎంత పెరిగిందంటే?
All the best to Team #Kannappa!
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025
My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.
Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.
So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
అన్న పేరు లేకుండా..
మనోజ్ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు.. కన్నప్ప చిత్రబృందానికి శుభాకాంక్షలు! మా నాన్న ఆయన బృందం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలు కృషి చేశారు. ఇది బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. నా లిటిల్ చాంప్స్ అరి, వివి, అవ్రామ్ జ్ఞాపకాలను వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అలాగే తనికెళ్ళ భరణి జీవిత కల జీవం పోసుకొని రేపు అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. బంగారు హృదయం కలిగిన ప్రభాస్, మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , ప్రభుదేవాతో పాటు ఈ సినిమాని ప్రేమ, నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప' చిత్రానికి దర్శకత్వం వహించారు. సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికాలో 'కన్నప్ప' ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలాగే ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో ఈరోజు సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)