Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

2025 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆథిత్యం వహిస్తోంది. మే 10నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వేదికగా అందాల పోటీలు గ్రాండ్ గా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల అందగత్తెలు ఒక్కొక్కరిగా హైద్రాబాద్ చేరుకుంటున్నారు. 120కిపైగా దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

New Update
miss world 2025 at hyderabad

miss world 2025 at hyderabad

 Miss World 2025: మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారడం ఆసక్తికరంగా మారింది. గతేడాది 71వ ఎడిషన్ ముంబైలోనే జరగగా.. 72వ ఎడిషన్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిస్టత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మే 10 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు పాల్గొంటున్నారు.

120కి పైగా దేశాలు 

పోటీలు ప్రారంభం కావడానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో వివిధ దేశాల సుదరీమణులు ఒక్కొక్కరిగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. తాజాగా మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండియుజి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 8వ తేదీ వరకు పోటీలో పాల్గొనే అందాల భామలు హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరితో పాటు 120పైగా దేశాలు ప్రతినిథులు హాజరు కానున్నారు. 

తెలంగాణ కల్చర్, హెరిటేజ్ 

మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సౌకర్యాలు,  ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది 71వ ఎడిషన్ ముంబైలోనే జరగగా.. 72వ ఎడిషన్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. 

మే 10 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో  తెలంగాణ సంప్రదాయ నృత్యాలు,  తెగల నృత్య ప్రదర్శనలతో గ్రాండ్ ఓపెనింగ్ సీరిమనీ జరగనుంది. మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచం అంతా చూస్తున్న మిస్ వరల్డ్ వేదికపై ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని అందుకోబోయే బ్యూటీ ఎవరనేది ఆసక్తిగా మారింది. 

latest-news | telugu-news | Miss World 2025 hyderabad

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు