/rtv/media/media_files/2025/06/25/jeedimetla-mother-murder-case-1-2025-06-25-09-31-54.jpg)
Jeedimetla mother murder case
జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అంజలిని చంపేందుకే శివ అనే యువకుడితో పెద్ద కూతురు ప్రేమ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. శివను వదిలేసి బుద్దిగా చదువుకోమని అంజలి హెచ్చరించడంతో పగతో రగిలిపోయిన బాలిక.. తల్లి మాటలను లెక్కచేయకుండా ఎదురుదాడికి దిగిందట. తన ప్రేమకు తల్లి అడ్డు వస్తుందని ఎలాగైనా ఆమెను హతమార్చాలని కూతురు నిర్ణయించుకుంది. హైదరాబాద్ వచ్చి చంపాలని తన ప్రియుడు శివను కోరింది. చంపకపోతే అతడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను గట్టిగా బెదిరించింది. దీంతో ఆ యువకుడు తన తమ్ముడితో వచ్చి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read : గాంధీభవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
తల్లి అంజలి అంటే గిట్టదు..
నిందితురాలు బాలిక (16)కు తల్లి అంజలి అంటే చిన్నప్పటినుంచి నచ్చేది కాదట. రెండు పెళ్లీలు చేసుకుని, ఇద్దరిని వేరు వేరు మొగుళ్లతో కనడం బాలకకు అసలు ఇష్టం ఉండేది కాదు. అంతేకాదు తల్లి పనితీరు, బయటకు వెళ్లడం, పలువురు పురుషులతో సన్నిహితంగా ఉండటంపై కూడా ఆ బాలిక అనుమానం వ్యక్తం చేస్తుండేది. ఈ విషయంలో తల్లీ, కూతుళ్లకు గొడవలు జరిగాయి. పెద్ద అమ్మాయిని అంజలి చాలాసార్లు కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ గొడవ కాస్త పెద్దదవడంతో 7వ తరగతిలోనే తల్లి వద్ద ఉండను అంటూ పోలీసులకు బాలిక ఫిర్యాదు చేయగా.. అంజలి తన కూతురును రెండేళ్ల పాటు గుండ్లపోచం పల్లిలోని సోదరి ఇంట్లో ఉంచింది.
Also Read : యాక్సియమ్-4 మిషన్ సక్సెస్.. ISSతో డాకింగ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్
3 నెలల క్రితమే వచ్చి..
అయితే గత 3 నెలల క్రితమే నిందితురాలైన బాలిక తల్లి వద్దకు వచ్చింది. అయితే అప్పటికే నల్గొండకు చెందిన యువకుడితో ఇన్ స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది బాలిక. ఈ విషయం గుర్తించిన అంజలి పదొవ తరగతిలో ప్రేమ ఎందుకని, బుద్ధీగా చదువుకోవాలని బిడ్డను తీవ్రంగా హెచ్చరించింది. కానీ అంజలి మాటలు ఆమెకు నచ్చలేదు. తల్లి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ తాను ఎందుకు చేయకూడదనే భావన మొదలైంది. తన స్వేచ్ఛను హరిస్తోందని, ఇక ఆమె బతికుంటే తన పనులకు అడ్డువస్తుందని ఫిక్స్ అయింది. దీంతో ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. తల్లి లేకపోయినా ఎలాగోలా బతికేస్తాం. కానీ ఆమెతో ఇక ఉండలేమని భావించి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇది కూడా చదవండి: ఈ కూరగాయలను మూతపెట్టి ఉడికించోదా..? రుచితోపాటు ఆరోగ్యానికి హానని తెలుసా..!!
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి ఇద్దరు కూతుర్లు. ఆమె తన కూతుళ్లతో కలిసి షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అందులో పెద్ద కూతురు (15) షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 8వ తరగతి అభ్యసిస్తున్నట్లు తెలిపారు.
Also Read : విడుదలకు ముందే 'కన్నప్ప' రికార్డ్.. ఫుల్ జోష్ లో మంచు విష్ణు!
medak mother murder case | anjali | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | latest telangana news
Follow Us