Pakistan: బుద్దిమార్చుకోని పాక్.. భారత్‌ను అవమానించేలా చిల్లర చేష్టలు!
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే కొత్త వివాదం తలెత్తింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 7 దేశాల జెండాలను కరాచీ నేషనల్ స్టేడియం పైన ఎగురవేశారు. కానీ ఇందులో భారత త్రివర్ణ పతాకం మాత్రం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.