Pakistan cricket : దివాలా తీసిన పాక్ క్రికెట్ బోర్డు.. రూ.800 కోట్లు బొక్కా!
29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తానికి దివాలా తీసింది. రూ.800 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం ద్వారా బిలియన్ల రూపాయలు లాభపడతామన్న పాకిస్తాన్ బోర్టుల ఆశలు గల్లంతయ్యాయి.