MS Dhoni : ధోనీకి BCCI బంపర్ ఆఫర్..! మరి గంభీర్ ఒప్పుకుంటాడా ?

ధోనీని మెంటర్‌గా నియమించుకునేందుకు BCCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోమే మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని ధోనీ వ్యూహాలను వినియోగించుకోవాలని యోచిస్తుననట్లు సమాచారం. మరి ధోని ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

New Update
MS Dhoni and BCCI

MS Dhoni and BCCI

స్టార్‌ బ్యాట్స్‌మెన్ MS ధోనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు గ్రౌండ్‌లో అడుగుపెడితేనే క్రికెట్‌ అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. భారత్‌కు రెండు వరల్డ్‌ కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీని, అలాగే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కు ఐదుసార్లు కప్‌ అందించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ మ్యాచ్‌లకు ధోని రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం ఐపీఎల్‌లో మాత్రనే ఆడుతున్నాడు. 

Also Read: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు!

వచ్చే ఐపీఎల్‌లో ఆడుతాడా ? లేదా ? అనేది కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ధోనికి భారత క్రికెట్‌ బోర్డు ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  2021 టీ20 వరల్డ్ కప్‌ సమయంలో బీసీసీఐ ధోనీని మెంటర్‌గా నియమించుకున్న విషయం తెలసిందే. కానీ కేవలం ఆ టోర్నీకి మాత్రమే పరిమితమయ్యేలా అగ్రీమెంట్ చేసుకుంది. అనంతరం ధోనికి క్రికెట్‌లో ఎలాంటి బాధ్యతలు రాలేదు. అయితే మరోసారి ధోనీని మెంటర్‌గా నియమించుకునేందుకు BCCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోమే మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని ధోనీ వ్యూహాలను వినియోగించుకోవాలని యోచిస్తుననట్లు సమాచారం. మరి ధోని ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: నీరజ్ చోప్రా ఖాతాలో మరో మెడల్.. జూరిచ్ డైమండ్ లీగ్ రన్నరప్

అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా  కొనసాగుతున్నాడు. మెంటర్ బాధ్యతలు ధోనీకి అప్పగించే విషయంలో అతడు అనుకూలంగా ఉండే ఛాన్స్ లేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ధోనీ సారథ్యంలో గెలిచిన వన్డే, టీ20 వరల్డ్ కప్ టీమ్‌లలో గంభీర్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలో క్రికెట్‌ క్రెడిట్‌ను మొత్తం సారథిగా ధోనీకి ఇవ్వడం కరెక్ట్ కాదని గంభీర్‌ అన్న వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. 

Also Read: అందరి ముందే అసభ్యంగా ప్రవర్తించిన ప్లేయర్.. భారీ ఫైన్ వేసిన ఆట నిర్వాహకులు!

టీమ్ మొత్తం కలిసికట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని గంభీర్‌ చెబుతుండేవాడు. అయితే ధోని లాంటి ప్రముఖ క్రికెటర్‌ను తనకన్న పై స్థానంలో ఉంచేందుకు గంభీర్‌ సానుకూలత వ్యక్తం చేస్తాడా ? లేదా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇటీవల వీళ్లిద్దరు కలిసి ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో ఇద్దరు సరదాగా సంభాషించుకున్న దృశ్యాలు కనిపించాయి. ధోనీకి మరీ మెంటర్ బాధ్యతలు వస్తాయా ? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.   

Also Read: ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా వీసా ఆంక్షలు.. తిప్పికొట్టడానికి ఇండియా మాస్టర్ ప్లాన్ ఇదే!

Advertisment
తాజా కథనాలు