Javelin Throw: నీరజ్ చోప్రా ఖాతాలో మరో మెడల్.. జూరిచ్ డైమండ్ లీగ్ రన్నరప్

భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా ఖాతాలో మరో మెడల్ చేరింది. జూరిచ్ డైమండ్ లీగ్ లో రన్నరప్ గా అతను నిలిచాడు. జర్మనీ ప్లేయర్ జూలియన్ వెబర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా నీరజ్ రెండవ స్థానంలో ఉన్నాడు.

New Update
neeraj

Neeraj Chopra

రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఒకే ఒక్క జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరో మెడల్ సాధించాడు. జూరిచ్ డైమండ్ లీగ్ లో రన్నరప్ గా నిలిచాడు. 85.01 పాయింట్లను నీరజ్ సాధించాడు. జర్మనీ స్టార్‌ ప్లేయర్‌ జూలియన్‌ వెబర్‌ (91.51) విజేతగా అవతరించాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్‌ వాల్‌కాట్‌ (84.95 మీటర్లు) మూడోస్థానంలో ఉన్నాడు. అయితే వరల్డ్ ర్యాగింగ్ లో మాత్రం నీరజ్ యే ఇంకా నెంబర్ వన్ గా ఉన్నాడు. 

రెండో స్థానంలో..

జూరిచ్ డైమండ్ లీగ్ లో విజేతగా అవతరించిన జూలియన్ వెబర్ వరల్డ్ ర్యాంకింగ్ లో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ సారి ఆశ్చర్యకరంగా అతను ముందంజ వేయడమే కాకుండా విజేతగా కూడా నిలిచాడు. వెబర్‌ తొలి ప్రయత్నంలో 91.37 మీటర్లు, రెండో ప్రయత్నంలో 91.51 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. మరోవైపు నీరజ్ మొదటి ప్రయత్నంలో 84.35 మీటర్లు, రెండో ప్రయత్నంలో 82 మీటర్లు విసిరాడు. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్ విసిరాడు. ఇక చివరి ప్రయత్నంలో 85.01మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చివరి రౌండ్‌ వరకు రెండో స్థానంలో ఉన్న కెషోర్న్‌ వాల్‌కాట్‌ చివరి ప్రయత్నంలో 78.30 మీటర్లే విసరడంతో నీరజ్‌ రెండో స్థానాన్ని సంపాదించగలిగాడు. 2022లో జరిగిన జూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌లో నీరజ్‌ తొలిసారి విజేతగా అవతరించాడు. 

Also Read: Mood Of The Nation: కంటిన్యూ అవుతున్న మోదీ మేనియా..ఎన్డీయేకు 300 సీట్లు గ్యారంటీ అంటున్న మూడ్ ఆఫ్ ద నేషన్

Advertisment
తాజా కథనాలు