Daniil Medvedev: అందరి ముందే అసభ్యంగా ప్రవర్తించిన ప్లేయర్.. భారీ ఫైన్ వేసిన ఆట నిర్వాహకులు!

రష్యా టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌‌ ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురై కోర్టులోనే రాకెట్‌ను పగలగొట్టి ప్రేక్షకులను వెక్కిరిస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో రూ.37 లక్షల జరిమానా విధించారు.

New Update
Daniil Medvedev

Daniil Medvedev

పోటీపడి మరి ఆడిన ఆటలో ఓడిపోయినప్పుడు కొందరు అసహనానికి గురి అవుతారు. దీనివల్ల కొందరు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ కూడా ఆటలో ఓడినందుకు అందరి ముందే అసభ్యంగా ప్రవర్తించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్‌లో మెద్వెదెవ్ ఓడిపోయాడు. ప్రపంచ నంబర్- 13 ఆటగాడు అయిన మెద్వెదెవ్ ఓటమిని తట్టుకోలేక తన రాకెట్‌ను అందరూ చూస్తుండగానే విరగొట్టాడు.

ఇది కూడా చూడండి: Common Wealth Games: కేంద్రం సంచలన నిర్ణయం.. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ బిడ్‌కు ఆమోదం

అసహనానికి గురి కావడంతో..

దీనికి ముందు ప్రేక్షకులతో కోర్టులో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. అయితే ఇలా చేయడంతో నిర్వాహకులు మెద్వెదెవ్‌కు 42,500 డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.37 లక్షల జరిమానా విధించారు. మొదటి రౌండ్‌లో మెద్వెదెవ్‌ ఆడగా అతనికి 1,10,000 డాలర్ల ప్రైజ్‌మనీ వస్తుంది. దీనిలో మూడో వంతుకు పైగా మెద్వెదెవ్‌కు ఫైన్ వేశారు. మొదట్లో సహనంగానే ఆడిన మెద్వెదెవ్ చివరకు అసహనానికి గురయ్యాడు. అభిమానులను వెక్కిరిస్తూ ప్రవర్తించాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అసభ్య ప్రవర్తనకు నిర్వాహకులు మెద్వెదెవ్‌పై జరిమనా విధించారు. 

వరుసగా రెండు సెట్లు కోల్పోయినా కూడా మెద్వెదెవ్ పోరాడి ఆడాడు. తర్వాత మూడు, నాలుగు సెట్లలో ఆడి గెలిచి సమానంగా నిలిచాడు. కానీ ఐదో సెట్‌లో ఓడిపోయాడు. ఇక అప్పుడు ఓ ఫొటో గ్రాఫర్ కూడా ఆటకు ఇబ్బంది కలిగించాడు. దీనివల్ల కొన్ని నిమిషాల పాటు అంఫైర్లు గేమ్ నిలిపేశారు. దీనికి మెద్వెదెవ్ కూడా గట్టిగా అరుస్తూ స్పందించాడు. అయితే అభిమానులు రెచ్చగొడితే ఓర్పుగా ఉండకుండా గొడవ చేశాడు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకుండా ఉంటే ఇలానే ఉంటుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Romario Shepherd: విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ బ్యాటర్.. ఒక్క బంతికే 22 రన్స్.. ఎలాగంటే?

Advertisment
తాజా కథనాలు