RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు!

ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

New Update
RCB

RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ టైటిల్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవడంతో మ్యాచ్ జరిగిన తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సంబరాలు చేసుకుంది. ఇవి తీవ్ర విషాదం చోటుచేసుకున్నాయి. జూన్ 4 వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ పరేడ్ నిర్వహించగా ఎక్కువ మంది ఫ్యాన్స్ చేరుకున్నారు. స్టేడియం లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరగడంతో 11 మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ విషాద ఘటన జరిగి దాదాపుగా మూడు నెలలకు పైగా అవుతుంది. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. చిన్నస్వామి తొక్కిసలాట ఘటనలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఆర్థిక పరిహారం ఇచ్చినట్లు ప్రకటించింది.

ఇది కూడా చూడండి: BCCI New President: రోజర్ బిన్నీ ఔట్.. బీసీసీఐ కొత్త చీఫ్ ఎవరంటే?

గౌరవంగా బాధిత కుటుంబాలకు..

ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. జూన్ 4వ తేదీన మా హృదయాలు బద్ధలయ్యాయి. ఆర్సీబీ  కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను మేము కోల్పోయాము. వారు మనలో భాగమే. మన నగరం, మన సమాజం, మన జట్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వారు ఒక భాగమే. ఇప్పుడు వారు లేకపోవడం బాధాకరం. వారు వదిలిపెట్టిన స్థలాన్ని ఎంత మద్దతు ఇచ్చినా పూరించలేము. కానీ మొదటి అడుగుగా, అత్యంత గౌరవంతో ఆర్సీబీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఆర్థిక సాయంగా ఇచ్చాం. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, కరుణ, ఐక్యత, నిరంతర సంరక్షణగా ఇచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ఈ ఆర్సీబీ ఈ ప్రకటన చేసింది. 

ఇది కూడా చూడండి: Rohith Sharma: యోయో కి టెస్ట్ కు తాత..బ్రాంకో టెస్ట్ కు రోహిత్

Advertisment
తాజా కథనాలు