/rtv/media/media_files/2025/08/30/india-master-plan-2025-08-30-12-59-35.jpeg)
India master plan
ఇండియా(india) పై పగబట్టిన ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థని, అమెరికా వెళ్లే విద్యార్థుల భవిష్యత్‌ని దెబ్బకొడుతున్నాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్ధులపై ఆంక్షలు విధిస్తున్నాడు ట్రంప్. అమెరికా గవర్నమెంట్ విధించిన కొత్త సుంకాలు(trump tariffs on india), అలాగే వీసా ఆంక్షలను ఎదుర్కొనేందుకు భారత ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు, అమెరికాకు మధ్య వాణిజ్య సంబంధాలు, వీసా విధానాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈక్రమంలో మోదీ విదేశీ పర్యటనల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ(pm modi) జపాన్ 2 రోజుల పర్యటనలో ఉన్నారు. తర్వాత అటు నుంచి చైనా వెళ్లనున్నారు.
Also Read : ట్రంప్ డిజిటల్ పన్నుల ఆగ్రహం వెనుక మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్?
సుంకాల పెంపుని ఎదుర్కొనే వ్యూహం
అమెరికా భారతీయ వస్తువుల దిగుమతిపై 50% వరకు సుంకాలను (టారిఫ్‌లు) పెంచింది. ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, రసాయనాల వంటి రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిని ఎదుర్కోవడానికి భారత్ ఈ చర్యలు తీసుకుంటోంది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. యూకే, జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ, ఈజిప్ట్, బ్రెజిల్ వంటి 40 దేశాలలో వస్త్రాల ఎగుమతులను పెంచడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జపాన్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి పలు కీలక చర్చలు జరిపి, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్థిక సహకారం, రక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు ఒక పదేళ్ల రోడ్‌మ్యాప్‌ను రూపొందించాయి. రాబోయే పదేళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ (సుమారు రూ. 6 లక్షల కోట్లు) ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి జపాన్ అంగీకరించింది. ఇది గతంలో పెట్టిన పెట్టుబడులకంటే రెట్టింపు.
స్వదేశీ వస్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం: 'ఆత్మనిర్భర్ భారత్', 'వొకల్ ఫర్ లోకల్' వంటి నినాదాలతో దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
GST తగ్గింపు: దేశీయ వినియోగదారులకు భారం తగ్గించడానికి జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచించాయి. ముఖ్యంగా, దుస్తులు, సిమెంట్, ఇతర నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.
లాబీయింగ్:అమెరికాలోని ట్రంప్ వర్గాలకు దగ్గరగా ఉండే లాబీయింగ్ సంస్థలను నియమించుకుని, భారతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : గొప్పలు చెప్పుకోనివ్వలేదు..భారత్ పై సుంకాలకు అదే కారణం..జెఫరీస్
వీసా ఆంక్షలను ఎదుర్కొనేందుకు ప్రణాళిక
ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది. దీని ప్రకారం, విద్యార్థులు 4 సంవత్సరాలకు మించి అమెరికాలో ఉండటానికి వీలుండదు. ఈ ప్రతిపాదన భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత ప్రభుత్వం కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలతో కలిసి భారతీయ విద్యార్థులకు అనుకూలమైన విధానాలను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే మోదీ జపాన్ పర్యటనలో ఇండియా యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అగ్నిమెంట్ కూడా జరిగింది. ఇది జపాన్ అభివృద్ధికి కూడా తొడ్పడనుంది. ఐదేళ్లలో 50 వేల మంది నైపుణ్యం కలిగిన అర్థనైపుణ్య కార్మికులను భారతదేశం నుంచి జపాన్‌కు పంపాలని నిర్ణయించారు. దీని ద్వారా జపాన్ ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి భారత్ సహాయపడుతుంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి దేశీయ విద్యా సంస్థలలో నాణ్యత, పరిశోధనలను మెరుగుపరచడంపై ఇండియా దృష్టి సారించింది. వీసా విధానాలపై అమెరికా ప్రభుత్వంతో దౌత్య స్థాయిలో చర్చలు జరపడానికి ఇప్పటికీ భారత్ సిద్ధంగా ఉంది.