Cricketer : ప్రాక్టీస్ లో బాల్ తగిలి టీనేజ్ క్రికెటర్ మృతి

ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మృతి చెందాడు. ఈ ఘటన స్థానిక క్రీడా సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

New Update
Aus cricketer

ఆస్ట్రేలియా(australia) క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్(cricketer) బెన్ ఆస్టిన్(Ben Austin) ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మృతి చెందాడు. ఈ ఘటన స్థానిక క్రీడా సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మెల్‌బోర్న్‌లోని ఫెర్న్‌ట్రీ గల్లీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వాలీ ట్యూ రిజర్వ్ మైదానంలో ఈ సంఘటన జరిగింది. బెన్ ఆస్టిన్ తన క్లబ్ జట్టు తరఫున ఆడబోయే టీ20 మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఈ సమయంలో బౌలింగ్ మెషిన్ నుంచి లేదా ఒక సహచరుడు విసిరిన బంతి అతడి తలకు ప్రాంతానికి బలంగా తగిలింది. హెల్మెట్ ధరించినా, బంతి బలంగా తాకడంతో బెన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు అతడికి ప్రథమ చికిత్స అందించి, మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో బెన్ ఆస్టిన్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

Also Read :  BCCI : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన

ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ సంతాపం

ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఈ విషాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "మా యువ ఆటగాడు బెన్ ఆస్టిన్ మరణంతో మేము పూర్తిగా కుంగిపోయాము. అతడి మరణం మా క్రికెట్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కష్ట సమయంలో బెన్ కుటుంబ గోప్యతను గౌరవించాలని మనవి చేస్తున్నాము" అని క్లబ్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ దురదృష్టకర సంఘటన 2014లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణాన్ని గుర్తు చేసింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బౌన్సర్ తగిలి మెడకు గాయం కావడంతో హ్యూస్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. హ్యూస్ మరణించిన కొన్ని గంటల తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో భారత్‌తో జరగాల్సిన తొలి షెడ్యూల్ క్రికెట్ టెస్ట్‌ను వాయిదా వేసింది. తాజాగా బెన్ ఆస్టిన్ మృతితో క్రికెట్‌లో ఆటగాళ్ల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. 

Also Read :  IND vs AUS : ఆసీస్‌పై టీమిండియా ప్రతీకార పోరు.. నేడు  తొలి టీ20 మ్యాచ్‌

Advertisment
తాజా కథనాలు