/rtv/media/media_files/2025/04/20/ub9IzN6XNLTzKpLHghrM.jpg)
IPL 2025 Points Table
ఐపీఎల్ 2025 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ మ్యాచ్‌లలో బడా బడా టీమ్స్ వరుస ఓటములను చవిచూస్తుంటే.. చిన్న చిన్న జట్లు మాత్రం వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పటికి ఈ సీజన్ సగం కంప్లీట్ అయింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో 4 జట్లు 10 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు టాప్‌లో ఉన్న టీమ్.. అలాగే లాస్ట్‌లో ఉన్న టీమ్.. వాటి పాయింట్స్ తెలుసుకుందాం.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
టాప్ టీమ్ ఇదే
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ జట్టు 10 పాయింట్లతో ముందు వరుసలో ఉంది. దీనితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు సైతం 10 పాయింట్లతో ఉన్నాయి. రన్ రేట్ ఆధారంగా ఈ జట్లు టాప్‌లో 1 నుంచి 4 ప్లేసుల్లో ఉన్నాయి.
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
గుజరాత్ జట్టు 7 మ్యాచ్‌లలో 5 గెలిచి 2 ఓడింది. ఇది +0.984 నెట్ రన్ రేటును కలిగి ఉంది.
ఢిల్లీ జట్టు 7 మ్యాచ్‌లలో 5 గెలిచి 2 ఓడింది. ఇది +0.589 నెట్ రన్ రేటును కలిగి ఉంది.
పంజాబ్ జట్టు 7 మ్యాచ్‌లలో 5 గెలిచి 2 ఓడింది. ఇది +0.308 నెట్ రన్ రేటును కలిగి ఉంది.
లక్నో జట్టు 8 మ్యాచ్‌లలో 5 గెలిచి 3 ఓడింది. ఇది +0.088 నెట్ రన్ రేటును కలిగి ఉంది.
ఇక ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం ఆర్సీబీ, కేకేఆర్, ముంబయి ఇండియన్స్ జట్లు ఫైట్ చేస్తున్నాయి. వీటి పాయింట్లు, రన్ రేట్ విషయానికొస్తే..
/rtv/media/media_files/2025/04/20/TgPR6r5Vu5Wjs9AipOXq.jpeg)
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ఆర్సీబీ జట్టు 7 మ్యాచ్‌ల్లో4 గెలిచి 3 ఓడింది. ఇది 8 పాయింట్లు, +0.446 నెట్ రన్‌రేటుతో 5వ స్థానంలో ఉంది.
కేకేఆర్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 4 ఓడింది. ఇది 6 పాయింట్లు, +0.547 రన్ రేట్‌తో 6వ స్థానంలో ఉంది.
ముంబయి ఇండియన్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 4 ఓడింది. ఇది కూడా 6 పాయింట్లు, +0.239 రన్ రేతో 7వ స్థానంలో ఉంది. రన్ రేట్ కారణంగా వెనుకబడింది.
రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 6 ఓడింది. ఇది 4 పాయింట్లు, -0.633 నెట్ రన్ రేట్‌తో 8వ స్థానంలో ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 5 ఓడింది. ఇది కూడా 4 పాయింట్లు, -1.217 నెట్ రన్ రేట్‌తో 9 వ స్థానంలో కొనసాగుంది.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 5 ఓడింది. ఇది 4 పాయింట్లు, -1.276 రన్ రేట్‌తో 10వ స్థానంలో ఉంది.
sports-news | csk | GT vs DC IPL 2025 | kkr | lsg | PBKS | rr | srh | rcb | latest-telugu-news | telugu-news