/rtv/media/media_files/2025/04/19/5wdi4YQTnDpcwch6ENwI.jpeg)
గతకొన్నాళ్లు సైలెంట్ అయిన హైడ్రా ఇప్పుడు మళ్లీ దూకుడు పెంచింది. ఆంద్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిర్మాణాలను కూల్చివేత ప్రారంభించింది. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజవర్గం ఎమ్మెల్యే. ఆయనకు చెందిన హఫీజ్‌పేటలోని వివాదాస్పదమైన 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేస్తోంది.
Also read: Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!
ఆ 20 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.2వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా. వసంత గ్రూప్ పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 20 ఎకరాల భూమిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భూమిలో కొంత భాగాన్ని అమ్మినట్లు తెలుస్తోంది.
Also read: Baba Venga: ‘ప్రపంచాన్ని అంతంచేసే ఆయుధాన్ని తయారు చేస్తున్న అమెరికా’
ఓ బాలుడు రాసిన లేఖతో 39 ఎకరాలు ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. కొండాపూర్‌లోని సర్వేనెంబర్ 79లో నిర్మించిన కమర్షియల్ షెడ్లు, ఫామ్ హౌస్‌లు హైడ్రా కూల్చి వేస్తోంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధువులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తోంది.
ప్రభుత్వ భూములలో..
— HYDRAA (@Comm_HYDRAA) April 19, 2025
ఆక్రమణలను తొలగించిన హైడ్రా
అఫీజ్‌పేట, రాయదుర్గంలో రూ. వందల కోట్ల విలువైన భూమికి విముక్తి@TelanganaCMO#HYDRAApic.twitter.com/KiORCwKPll
(tdp-mlas | hydra-demolitions | Hafizpet)