/rtv/media/media_files/2025/10/17/ind-vs-aus-odi-series-2025-2025-10-17-07-25-07.jpg)
ind vs aus odi series 2025
భారత్, ఆస్ట్రేలియా(ind vs aus) మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్ క్రికెట్ జట్టులో బ్యాటింగ్ లైనప్ అత్యంత కీలకమైన అంశంగా ఉంది. ఇందులో ఐదుగురు ఆటగాళ్ళు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ(rohith-sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఈ సిరీస్‌లో మోత మోగించనున్నారు.
Also Read : హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్
IND vs AUS ODI Series 2025
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు గిల్ సారథ్యంలో ఆడనున్నారు. ఈ సీనియర్ల అనుభవం జట్టుకు అత్యంత కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నారు. గత 10-15 ఏళ్లుగా భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన వీరిద్దరూ తమ 'మ్యాజిక్'ను కొనసాగించాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే, రోహిత్ తన విధ్వంసకర ఆరంభాలతో జట్టుకు శుభారంభాలు అందిస్తారని భావిస్తున్నారు.
ఇక మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణించడం జట్టుకు మరింత బలం ఇస్తుంది. గతంలో ఆస్ట్రేలియాపై రాహుల్ మంచి ప్రదర్శన చేశాడు. అతడు ఆస్ట్రేలియాపై కూడా బాగా రాణించగలడు. మరోవైపు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ (45 పరుగులు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే కోహ్లీ-రాహుల్ జోడీకే ఎక్కువ క్రెడిట్ దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
ఈ సిరీస్ లో శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీని సమర్థించుకోవడంతో పాటు, తన బ్యాటింగ్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అతను టెస్ట్ ఫార్మాట్‌లో నెం.4 స్థానంలో ఆడే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా గిల్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల వివిధ సిరీస్‌లలో సెంచరీలు సాధించి రికార్డులు మోగించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని భారీ స్కోర్లు చేయగల సత్తా అతడికి ఉంది. ఇలా మొత్తం మీద ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసికట్టుగా రాణిస్తే ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై భారత్ విజయం సాధించగలదు.
Also Read : అక్టోబర్ 19.. చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత