/rtv/media/media_files/2025/10/17/kohli-2025-10-17-07-56-18.jpg)
ప్రస్తుతం టీమ్ ఇండియా(team-india) ఆటగాళ్ళు ఆస్ట్రేలియా(australia) టూర్ లో ఉన్నారు అక్టోబర్ 19 నుంచి ఆసీస్ జట్టుతో వన్డే సీరీస్ ఆడతారు. ఈ సారి జట్టులో కుర్రాళ్ళతో పాటూ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా చేరారు. దీంతో జట్టుకు మునుపటి ఉత్సాహం తిరిగి వచ్చింది. దాంతో పాటూ వన్డే సీరీస్ గురించి అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. దాంతో పాటూ చాలా రోజుల తర్వాత టమ్ లోకి వచ్చిన కోహ్లీ(Virat Kohli), రోహిత్(Rohit Sharma) లు తమ పవర్ చూపించాలని ఎదురు చూస్తున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టార్గెట్‌గా టీమిండియాలో కొనసాగుతున్న కోహ్లి, రోహిత్ లకి ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. యువ ఆటగాళ్లు జట్టులోకి క్యూ కడుతున్న ఈ సమయంలో విరాట్, రోహిత్ తమ ఫామ్‌ని నిరూపించుకుని 2027 వరల్డ్ కప్ బరిలో నిలవాలని చూస్తున్నారు.
Also Read : అద్భుతమైన బ్యాటింగ్.. అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు అరుదైన అవార్డు!
ఆనందంతో నేల మీద పడి దొర్లి..
వన్డే సీరీస్‌కు ఇంకా రెండు రోజులే టైమ్ ఉండడంతో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. అక్కడ పెర్త్ స్టేడియంలో ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. దీంతో ఆటగాళ్ళను చూడడానికి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఇండియన్లు ఆ స్టేడియానికి వెళుతున్నారు. దాంతో పాటూ వీలు దొరికినప్పుడు తమ అభిమాన ఆటగాళ్ళ దగ్గర నుంచీ ఆటోగ్రాఫ్ లు తీసుకుంటున్నారు. ఇలాగే ఓ బుడ్డోడికి కూడా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఆటోగ్రాఫ్(Kohli Autograph) ఇచ్చాడు. దీంతో ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాన్ని ఎల ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియలేదు. సంతోషంతో పెర్త్ స్టేడియంలో పరుగులు తీశాడు. గ్రౌండ్ లో పడి దోర్లాడు. దీనిని ఎవరో వీడియోగా తీసి సోషల్ మీడియా(Social Media)లో పెట్టారు. ఇప్పుడు అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియోకు అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. అదరూ షేర్ చేస్తూ డ్రీమ్ ఆఫ్ విరాట్ కోహ్లి ఫ్యాన్ అంటూ పోస్టులు చేస్తున్నారు.
The happiness of a Kid after getting Virat Kohli's autograph 🥹❤️pic.twitter.com/e5dhcAPVw8
— Suprvirat (@Mostlykohli) October 16, 2025