Rohit Sharma: అక్టోబర్ 19.. చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. సచిన్, కోహ్లీ, ధోని తర్వాత

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 500వ మ్యాచ్ కానుంది. సచిన్, కోహ్లీ, ధోని, ద్రావిడ్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

New Update
rohit sharma set to play his 500th international game against australia in 1st odi

rohit sharma set to play his 500th international game against australia in 1st odi

అక్టోబర్ 19 నుంచి పెర్త్ లో ఆస్ట్రేలియా, భారత్(ind vs aus) మధ్య సమరం మొదలు కానుంది. మూడు మ్యాచ్ లలో భాగంగా వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఈ సారి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టి ఆయన స్థానంలో కెప్టెన్ గా యంగ్ ప్లేయర్, ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను ప్రకటించారు. దీంతో త్వరలో ఆసీస్ తో జరగబోయే వన్డే సిరీస్ కు గిల్ టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. 

Also Read :  హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్

రోహిత్ అరుదైన ఘనత

ఇదిలా ఉంటే పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే(IND Vs AUS ODI Series 2025) లో రోహిత్ శర్మ మరో ప్రధాన మైలురాయిని సాధిస్తాడు. తొలి వన్డేలో మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక విజయాన్ని తన పేరున లిఖించుకుంటాడు. ఇప్పటికే రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. 

ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మ్యాచ్ రోహిత్‌కు ఎంతో ప్రత్యేకమైనది. అక్టోబర్ 19న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అందులో రోహిత్ మూడు ఫార్మాట్లలో 67 టెస్టులు, 273 వన్డేలు, 159 టీ20లు కలిపి ఈ మైలురాయిని చేరుకోనున్నాడు. 

Also Read :  ఆసీస్ గడ్డపై ఐదుగురు కాటేరమ్మ కొడుకులు.. మోత మోగించనున్న టీమిండియా

ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ ఆటగాడిగా రోహిత్(rohith-sharma) రికార్డు సృష్టించనున్నాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్ లు, విరాట్ కోహ్లీ 550 మ్యాచ్లు, ఎంఎస్ ధోనీ 535 మ్యాచ్లు, రాహుల్ ద్రావిడ్ 504 మ్యాచ్ లు ఆడి ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇప్పుడు ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ ఆటగాడిగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్‌గా రోహిత్ నిలవనున్నాడు.

తన 500వ మ్యాచ్ ఆడటానికి ముందు రోహిత్ ఖాతాలో 49 సెంచరీలు సహా 19,700 పరుగులు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మరో సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల మార్క్‌ను కూడా అందుకుంటాడు. ఆసీస్‌తో తొలి వన్డేలో రోహిత్ అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను అలరించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాపై ఎలా రాణిస్తుందో చూడాలి.

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్:

తొలి వన్డే: అక్టోబర్ 19, పెర్త్

రెండో వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్

మూడో వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ

Advertisment
తాజా కథనాలు