/rtv/media/media_files/2025/11/04/team-india-w-2025-11-04-06-28-40.jpg)
రెండు రోజులుగా ఒకటే హోరు. టీమ్ ఇండియా అమ్మాయిల గెలుపు సంబారాల జోరు. మొత్తం దేశమంతా ఏకమై విక్టరీని సెలట్రేట్ చేసుకుంటున్నారు. ప్రతీ అమ్మాయి తాను గెలిచినంతగా సంబరపడిపోతోంది. ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెర తీసింది మహిళల భారత క్రికెట్ టీమ్ జట్టు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని జోష్ ను మొత్తం దేశమంతా నింపింది.
Also Read : ప్రపంచ కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్‌లు..
మాకు తిరుగులేదు..
ఇక టీమ్ ఇండియా అమ్మాయిల సెలబ్రేషన్స్(Team India Womens Celebrations 2025) గురించి, వారి ఆనందం గురించి చెప్పనక్కర్లేదు. జట్టులోని వారందరూ క్లౌడ్ నైన్ లోనూ ఉన్నారు. వారి కష్టం, ఎన్నో ఏళ్ళ ఎదురు చూపులు రెండు రోజులుగా నవ్వులై విరబూస్తున్నాయి. సోషల్ మీడియా అంతా భారత జట్టు వీడియోలే. ప్రతీ మూమెంట్ ను క్యాప్చర్ చేయడమే కాక...వాటిని వీడియోలు నింపేశారు. ఈ క్రమంలో భారతజట్టు తమ విక్టరీ గీతాన్ని కూడా రిలీజ్ చేసింది. చాలా రోజులుగా తాము ీదన్ని తయారు చేసి పెట్టుకున్నామని..వరల్డ్ కప్ గెలిచాక బయటపడెదామనుకున్నామని చెప్పారు. మ్యాచ్ గెలిచిన అనంతరం ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీం ఇండియా తమ విజయ గీతాన్ని ఆవిష్కరించింది.లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీం ఇండియా తమ విజయ గీతాన్ని ఆవిష్కరించింది. జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంథాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జట్టులోని ఇతర సభ్యులతో కలిసి, 'హమ్ హై టీం ఇండియా' అనే గీతాన్ని ఆలపించారు. "టీమ్ ఇండియా, టీమ్ ఇండియా! కర్దే సాబ్కీ హవా టైట్, కోయి నా లేగా హమ్కో లైట్...సాథ్ మే చలేంగే, సాథ్ మే ఉతేంగే, హమ్ హై టీమ్ ఇండియా, హమ్ సాథ్ మే జితేంగే.. నా లేగా కోయి పంగా, కర్ హుమ్ న్సాబ్. దేంగే అప్. హైన్ టీమ్ ఇండియా!! హమ్ హే టీమ్ ఇండియా" అనే పాటను పాడుతూ తమ విక్టరీని మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు.
Also Read : భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన కోచ్ మజుందార్ ఎవరు?.. ఆయన చరిత్రేంటి..!
THE VICTORY SONG OF TEAM INDIA IN WOMENS WORLD CUP. ❤️🇮🇳
— Johns. (@CricCrazyJohns) November 3, 2025
- This team is a family. pic.twitter.com/l5FZywzFkF
Follow Us