/rtv/media/media_files/2025/11/03/team-india-womens-head-coach-amol-muzumdar-2025-11-03-18-06-37.jpg)
team india womens head coach Amol Muzumdar
హీరోలెప్పుడూ తెరవెనుకే ఉంటారు. అవునన్నా.. కాదన్నా ఇది అక్షర సత్యం. అలాంటి కథే భారత మహిళల ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్‌ది కూడా. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీం ఇండియా కోచ్ అమోల్ ముజుందార్ శిక్షణలో మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికా జట్టును 52 పరుగులతో ఓడించి భారత్ తొలిసారిగా వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో భారత్ మహిళా క్రీడాకారుణులపై యావత్ దేశమంతా ప్రసంశలు కురిపించింది.
అదే సమయంలో తెరవెనుక వీరుడైన కోచ్ అమోల్ ముజుందార్ పేరు కూడా మారుమోగుతోంది. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు అమోల్ ముజుందార్ ఎవరు?.. ఆయన క్రికెట్‌లో ఎలా రాణించాడు? అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. - IND W vs SA W FINAL MATCH
Also Read : వామ్మో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ముంబైలో జననం
అమోల్ మజుందార్(Amol Majumdar) ముంబైలో నవంబర్ 11, 1974న జన్మించాడు. ఆయనకి చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే క్రికెట్ పై ఫోకస్ పెట్టాడు. మెల్లి మెల్లిగా శిక్షణ తీసుకున్నాడు.
తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇలా తన 19 ఏళ్ల వయస్సులోనే రంజీ ట్రోఫీలో అరంగేంట్రం చేశాడు. ఈ ట్రోఫీలో అజేయంగా 260 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఈ రికార్డు దాదాపు రెండు దశాబ్దాలుగా అతని పేరుమీదే ఉండటం విశేషం. అక్కడ నుంచి అమోల్ ముజుందార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా అతడు ముంబై క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరొందాడు.
భారత్ జట్టులో చోటు దక్కలేదు
ఆ సమయంలో ముంబై తరపున ఆడుతున్నప్పుడు నిలకడగా మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. అతడికి అంతర్జాతీయ జట్టులో స్థానం లభించలేదు. అప్పటికి భారత జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నందున.. అమోల్ ముజుందార్‌కు భారత జట్టులో స్థానం లభించలేదు.
తదుపరి సచిన్
కానీ అతన్ని తదుపరి సచిన్ టెండూల్కర్ అని కూడా పిలిచేవారు. ముజుందార్ దాదాపు 171 రంజీ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 48.13 బ్యాటింగ్ సగటుతో 1167 పరుగులు చేశాడు.
Also Read : ఈ అవార్డును వాళ్లకు అంకితం ఇస్తున్నా.. దీప్తి శర్మ ఎమోషనల్!
విజయవంతమైన కెరీర్
అతడి పేరిట 30 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ముజుందార్ కెప్టెన్సీలో ముంబై 37వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను సైతం గెలుచుకుంది. అయితే ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. ఇంత విజయవంతమైన కెరీర్ ఉన్నప్పటికీ.. అతనికి టీం ఇండియా తరపున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు.
2014లో క్రికెట్‌కు గుడ్ బై
చివరిగా ముజుందార్ 2014లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత అతడు కోచింగ్ ప్రారంభించాడు. అక్కడ నుంచి అండర్-19, అండర్-23 జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. అలాగే మూడు సంవత్సరాల పాటు రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు.
2023లో భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్
తరువాత ముజుందార్ రంజీ ట్రోఫీలో ముంబై కోచ్‌గా పనిచేశాడు. అనంతరం అతడి సామర్థ్యం నమ్మకముంచి BCCI అతన్ని అక్టోబర్ 2023లో భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించింది. అతని కృషి చివరికి ఫలించింది. 2025లో ముజుందార్ నాయకత్వంలో భారత మహిళల జట్టు మొదటిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
 Follow Us