/rtv/media/media_files/2025/11/03/team-india-2025-11-03-20-15-45.jpg)
Surat Industrialist To Reward India's Women's World Cup Heroes
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళా క్రీడాకారిణులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ మహిళల జట్టులో ఉన్నవాళ్లందరికీ వజ్రాల ఆభరణాలు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే సోలార్ ప్యానెళ్లు కూడా గిఫ్డ్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: బాబోయ్ బస్సులు.. మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల.. 2 నెలల్లో 100 మంది బలి!
ఇక వివరాల్లోకి వెళ్తే ఆదివారం మహిళల వరల్డ్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందుగానే గోవింద్ ఢోలాకియా BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. '' ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటిదాకా టీమిండియా మహిళా జట్టు మంచి ప్రదర్శన చూపించింది. ఫైనల్‌లో అమ్మాయిలు గెలిచే కప్పు సాధిస్తే టీమ్‌లో ఉన్న సభ్యులందరికీ డైమండ్ నక్లెస్‌లను కానుకగా ఇవ్వాలనుకుంటానని'' లేఖలో పేర్కొన్నారు.
టీమిండియా మహిళల జట్టు ఇప్పుడు ఫైనల్‌లో గెలవడంతో గోవింద్ చెప్పినట్లుగానే తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే ఆ జట్టు సభ్యులందరికీ వజ్రాల నక్లెస్‌లు, సోలార్ ప్యానెళ్లు అందిస్తానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఢొలికియా ఇలా గిఫ్టులు అందించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బహుమతులు అందించారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన క్రాంతి గౌడ్‌కు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటన చేశారు.
Also Read: అదిరిపోయింది భయ్యా... టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్
 Follow Us