ICC Player Of The Month: అద్భుతమైన బ్యాటింగ్.. అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు అరుదైన అవార్డు!

టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది.

New Update
ICC

ICC

టీమిండియా(team-india) యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(abhishek-sharma), భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(smriti-mandhana)లకు అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player of the Month) అవార్డు లభించింది. ఒకే నెలలో భారత పురుష, మహిళా క్రికెటర్లకు ఈ అవార్డు రావడం విశేషం. వీరిద్దరు బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టు విజయాలను కూడా సాధించింది. అయితే ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ క్రమంలో పురుషుల విభాగంలో అభిషేక్‌కు ఈ అవార్డు దక్కింది.

ఇది కూడా చూడండి: Kohli Autograph: హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్

ఆసియా కప్‌లో సృష్టించిన విధ్వంసం..

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ ఏకంగా 314 పరుగులు చేశాడు. అతని సగటు 44.58 గా ఉండగా, స్ట్రైక్ రేట్ దాదాపు 200కి దగ్గరగా ఉంది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా దక్కింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో టీ20 ఫార్మాట్‌లో అతను నిలకడగా రాణించడం వల్ల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. దీనితో అభిషేక్ శర్మ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే అతని కెరీర్‌లో మొదటి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇదే. 

మహిళల విభాగంలో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ అవార్డును గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మంధాన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో మంధాన వరుసగా 58, 117, 125 పరుగులు చేసి సత్తా చాటింది. మొత్తం సిరీస్‌లో 77 సగటుతో 308 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా ఒక మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళల విభాగంలో ఈ అవార్డు రేసులో మంధానతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్, పాకిస్థాన్ ప్లేయర్ సిద్రా అమిన్ పోటీపడ్డారు. అయినప్పటికీ మంధానకు ఈ అవార్డు వరించింది. 

ఇది కూడా చూడండి: IND vs AUS : ఆసీస్ గడ్డపై ఐదుగురు కాటేరమ్మ కొడుకులు.. మోత మోగించనున్న టీమిండియా

Advertisment
తాజా కథనాలు