Sky With RTV: చివర వరకు పట్టుదలతో ఆడాం...ఆసియా కప్ టోర్నీ పై ఆర్టీవీతో కెప్టెన్ స్కై స్పెషల్ ఇంటర్వ్యూ

ఆసియాకప్ గురించి కెప్టెన్ సర్యకుమార్ యాదవ్ ఆర్టీవీతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డామని...చివర వరకు మ్యాచ్ లను పట్టుదలతో ఆడామని చెప్పారు.  కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారని కితాబిచ్చారు.

New Update

ఆసియా కప్ టోర్నీ 2025(Asia cup 2025) భారత చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇందులో టీమ్ ఇండియా(team-india) అద్భుతంగా రాణించింది. ఒక్క మ్యాచ కూడా ఓడిపోకుండా టైటిల్ ను సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్య్థి పాకిస్తాన్ ను ఫైనల్ లో మట్టి కరిపించి మరీ టోర్నీని సొంతం చేసుకుంది. దీంతో పాటూ పాకిస్తాన్ జట్టుతో సంబంధం లేనట్టు ఉండడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం..చివరలో పాకిస్తాన్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా కప్ ను తీసుకోకపోవడం లాంటివి అన్నీ కూడా భారత క్రికెట్ లో గుర్తుండిపోతాయి. మొట్టమొదటిసారిగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కప్ ను తీసుకోమని తిరస్కరించారు. ఇది కూడా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. 

Also Read :  ENG vs SA: చూసే లోపే మ్యాచ్ అయిపోయింది.. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ సంచలనం

కుర్రాళ్ళు చించేశారు..

ఈ విషయాలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(surya-kumar-yadav) ఈరోజు ఆర్టీవీ(rtv)తో పంచుకున్నారు. ఆసియా కప్ తర్వాత స్కై మొట్టమొదటిసారిగా ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డామని సూర్య కుమార్ చెప్పారు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది అనడానికి నిదర్శనంగా నిలిచామని చెప్పుకొచ్చారు. చివరి మ్యాచ్ వరకు పట్టుదలో ఆడామని చెప్పారు. ఫైనల్స్ లో మూడు వికెట్లు పడగానే కొంచెం టెన్షన్ పడ్డామని..కానీ భారత బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గానే ఉండడంతో ధైర్యంగా పోరాటం చేశామని చెప్పారు. దుబే, సంజు, తిలక్, రింకు ఉండడంతో గెలుస్తామని నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.  తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడాడని సూర్య కుమార్ కితాబిచ్చారు. టీమ్ లో అందరూ చిన్నవాళ్ళని...ాళ్ళకి పెద్దగా ఇంటర్నేషనల్ క్రికెట్ అనుభవం కూడా లేదని...కానీ ప్రతీ ఒక్కరూ ఆసియా కప్ లో ఫుల్ ఎఫెర్ట్స పెట్టారని.. చాలా బాగా రాణించారని చెప్పుకొచ్చారు. 

Also Read: BIG BREAKING: వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు..రష్మిక, విజయ్ ఎంగేజ్ మెంట్

Advertisment
తాజా కథనాలు