ENG vs SA: చూసే లోపే మ్యాచ్ అయిపోయింది..తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ సంచలనం

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నమెంట్‌లో మిగతా జట్లకు గట్టి సంకేతాలు పంపింది

New Update
england

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నమెంట్‌లో భారత్ తో సహా  మిగతా జట్లకు గట్టి సంకేతాలు పంపింది. ఈ మ్యాచ్ లో  మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 69 పరుగులకే (20.4 ఓవర్లలో) ఆలౌట్ అయ్యింది. ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోర్లలో ఒకటి.

సఫారీ బ్యాటర్లు విలవిల

ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి సఫారీ బ్యాటర్లు విలవిలలాడారు. ఆ జట్టులో సైనలో జాఫ్తా (22 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించింది. మిగిలిన 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లిన్సే స్మిత్ (3/7) అద్భుతమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు నాట్ స్కివర్-బ్రంట్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్ తలా 2 వికెట్లు తీసి సత్తా చాటారు.

ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా

కేవలం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు ఆమీ జోన్స్ (40 *), టామీ బ్యూమాంట్ (21*) ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో పూర్తి చేశారు.ఈ విజయంతో ఇంగ్లాండ్‌ తమ టోర్నమెంట్‌ను తిరుగులేని ఆధిపత్యంతో ప్రారంభించింది. బలమైన దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించడంతో, ఇంగ్లాండ్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో రికార్డులు 

  • మహిళల ODI క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇది మూడవ అత్యల్ప స్కోరు ఇదే. 
  • దక్షిణాఫ్రికా అత్యల్ప ODI ప్రపంచ కప్ స్కోరు 51 (2009లో న్యూజిలాండ్‌పై).
  • వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇదే మొదటిసారి. 
  • ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని 215 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇది ఇంగ్లాండ్ మహిళల ODI చరిత్రలో బంతుల పరంగా నమోదైన నాలుగో అతిపెద్ద విజయం.
Advertisment
తాజా కథనాలు