/rtv/media/media_files/2025/08/12/vijay-rashmika-2025-08-12-16-03-34.jpg)
vijay- rashmika
అందరూ ఊహించినట్లుగానే రష్మిక మందన్నా, విజయ్ దేవర కొండ ఒక్కటయ్యారు. ఇన్నాళ్ళు తమ సంబంధం గురించి ఏమీ మాట్లాడని ఈ లవ్ బర్డ్స్ ఈ రోజు తమ ఎంగేజ్ మెంట్ ను చేసుకున్నారు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లోనే ఈ ఫంక్షన్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ళిద్దరి పెళ్ళి జరగనుందని తెలుస్తోంది. ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్ లో విజయ్, రష్మికలు పెళ్ళి చేసుకుంటారని చెబుతున్నారు.
హీరోయిన్ రష్మికతో హీరో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న రష్మిక, విజయ్ దేవరకొండ జంట pic.twitter.com/BRFJS0y4UY
— NageshT (@NageshT93116498) October 3, 2025
డియర్ కామ్రేడ్ నుంచి..
గీత గోవిందం సినిమాతో మొదలైంది విజ్, రష్మికల ప్రేయ ప్రయాణం. ఆ తరువాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు. విజయ్, రష్మికలది హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. డియర్ కామ్రేడ్ దగ్గర నుంచీ వీళళ్‌ఇద్దరి ప్రేమ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ లవ్ బర్డ్స్ మాత్రం ఎప్పుడూ వాటిై స్పందించలేదు. తాము స్నేహితులమనే చెబుతూ వచ్చారు. చాలాసార్లు ట్రిప్ లు వెళ్లి..అక్కడ ఫోటోల్లో...దీపావళికి విజయ్ ఇంట్లో ఫోటోల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. అయినా కూడా ఎక్కడా కూడా తమ రిలేషన్ మీద విజయ్, రష్మికలు బయటపడలేదు. ఇప్పుడు కూడా ఎంగేజ్ మెంట్ గురించి ముందుగా ఎక్కడా బయటకు పొక్కనివ్వలేదు. దీంతో అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చినట్లయింది.