/rtv/media/media_files/2025/06/07/wMrGUFM8bVOgYzCFf6gs.jpg)
ksca secretary and treasurer have tendered resignation
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఊహించని విషాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియోషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శనివారం వారు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ఇద్దరు రాజీనామా
గత రెండు రోజులుగా ఊహించని, దురదృష్టకర సంఘటనలు జరిగాయని అన్నారు. ఇందులో తమ పాత్ర చాలా పరిమితమే అయినా.. నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసాము అని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి తమ రాజీనామా లేఖను సమర్పించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
KSCA Secretary A. Shankar and Treasurer E. Jairam said in a joint statement, "Although our role was very limited, but owing moral responsibility, we tender our resignation."#RCB #KSCA #Bengaluru #IPL2025 #CricketTwitter pic.twitter.com/kuDFqoSsCP
— InsideSport (@InsideSportIND) June 7, 2025
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
ఇదిలా ఉంటే ఈ తొక్కిసలాట కేసులో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సోసాలేతో పాటు, డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సునీల్ మాథ్యూ, సుమంత్, కిరణ్ కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సోసాలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, అది రాజకీయ ఒత్తిడి ఫలితంగా జరిగిందని సోసాలే కోర్టుకు అప్పీల్ చేశారు.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
మరోవైపు RCB, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌లపై ఇప్పటికే FIR ఫైల్ అయింది. దీని తర్వాత KSCA, RCB హైకోర్టును ఆశ్రయించాయి. కర్ణాటక హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేపట్టి కర్ణాటక ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. మొత్తం పరిస్థితిపై నివేదిక కోరింది. జూన్ 10న హైకోర్టు ఈ కేసును తదుపరి విచారణకు స్వీకరించనుంది.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
Bengaluru Stampede | RCB Victory Parade News | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news