/rtv/media/media_files/2025/09/25/sanju-2025-09-25-09-31-25.jpg)
బ్యాంటింగ్ ఆర్డర్ పై టీమిండియా(team-india) క్రికెటర్ సంజూ శాంసన్(sanju samson) కీలక కామెంట్స్ చేశాడు. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శాంసన్ ను బ్యాటింగ్ కు దించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ కు ముందు అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, సంజు శాంసన్‌ను ఉద్దేశించి, "మీరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణించారు. మరి ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఎందుకు ఆడుతున్నారు?" అని ప్రశ్నించారు.
దీనికి శాంసన్ మాట్లాడుతూ.. క్రీడలో తన సొంత ప్రయాణాన్ని స్టార్ హీరో మోహన్‌లాల్ తో పోల్చుకున్నారు. 40 ఏళ్లుగా నటిస్తున్న మోహన్‌లాల్ కు ఇటీవలే అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. నేనూ పదేళ్లుగా దేశం తరుపున ఆడుతున్నా.. అన్ని సార్లు హీరో పాత్రనే చేస్తానంటే కుదరదు. విలన్, జోకర్ పాత్రాలు కూడా చేయాల్సి ఉంటుంది. జట్టు కోసం నేను ఏ పాత్రలోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాను.
'Our Lalettan, Mohanlal' - Sanju Samson draws comparison with Kerala movie star.
— myKhel.com (@mykhelcom) September 25, 2025
India batter responds to his new middle-order role and says 'I have to be a Villain, I have to be a Joker' amid #AsiaCup2025#sanjusamson#INDvBANhttps://t.co/l8YG6vQpNR
నేను ఓపెనర్‌గా రాణించాను, కాబట్టి అక్కడే ఆడతాను అని చెప్పడం సరికాదు. నేను మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించాలనుకుంటున్నాను. జట్టుకు అవసరమైనప్పుడు నేను ఏ పాత్రలోనైనా రాణించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. తన పేరు సంజూ మోహన్‌లాల్ శాంసన్ అని తెలిపారు. సంజు చేసిన ఈ పోలికకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Also Read : ఇండియా, బంగ్లా మ్యాచ్ ఈరోజు...గెలిస్తే ఫైనల్స్ కే..
ఫైనల్ కు టీమిండియా
మరోవైపు ఆసియాకప్ 2025(Asia cup 2025) లో టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో 169 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సైఫ్ హాసన్(69) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 3, వరుణ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. రేపు బంగ్లా-పాక్ మ్యాచ్‌తో భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారు కానుంది.
ఇక ఆసియాకప్ 2025లో శ్రీలంక ఇంటి బాట పట్టింది. నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా గెలవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. పాక్ గెలిస్తే ఈ ఎడిషన్‌లో మూడో సారి టీమ్‌ఇండియాతో తలపడనుంది. అటు రేపు జరిగే భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా ఫైనల్ ఈ నెల 28న జరగనుంది.