Fake Police Station: ఫేక్ పోలీస్ స్టేషన్‌తో మోసం.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న కేటుగాళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేశారు. ఫేక్ పత్రాలు, ఫేక్ ఐడీలు, పోలీసుల చిహ్నాలతో ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అసలు విషయం బయటికొచ్చాక అందరూ నోరెళ్లబెట్టారు.