/rtv/media/media_files/2026/01/12/venezuela-2026-01-12-15-19-13.jpg)
Troops bled from nose, vomited blood, Did US use a sonic weapon in Venezuela during raid?
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్టు చేసి తీసుకెళ్లడం ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచింది. ఒక దేశ అధ్యక్షుడిని ఇలా సడెన్‌గా అదుపులోకి తీసుకోని అమెరికాకు తరలించాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ ఆపరేషన్ కోసం ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజువెలాపై దాడి చేసినప్పుడు అక్కడి సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. వైట్‌హౌస్ సెక్రటరీ దీన్ని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడం ఇతర దేశాలకు షాకిస్తున్నాయి.
వెనెజువెలా సెక్యురిటీ గార్డు తెలిపిన వివరాల ప్రకారం.. '' ఆపరేషన్ జరిగిన రోజున అకస్మాత్తుగా మా రాడార్ వ్యవస్థలు ఆగిపోయాయి. మా పై నుంచి చాలా డ్రోన్లు ఎగరడం చూశాం. కేవలం 8 హెలికాప్టర్ల నుంచి కొంత మంది సైనికులు దిగారు. సుమారు వాళ్లు 20 మంది ఉండొచ్చు. సాంకేతికపరంగా వాళ్ల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు వాళ్లను ఎప్పుడు చూడలేదు. మేము వందల మంది ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. వాళ్లు వేగంగా కాల్పులు చేశారు. ఒక్కో సైనికుడు నిమిషానికి 300 రౌండ్లు ఫైరింగ్ చేసినట్లు అనిపించింది. ఏదో విచిత్రమైన ఆయుధాన్ని వాళ్లు వాడారు. భారీ శబ్దం వచ్చింది. తల పేలిపోతున్నట్లు అనిపించింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. కొందరు రక్తం కక్కుకున్నారు. అందరం కింద పడిపోయి కదలలేకపోయామని'' వెనెజువెలా సెక్యూరిటీ గార్డు వివరించారు.
Also Read: రెనీ నికోలో గుడ్ కు సంఘీభావం...వేలాదిమంది రోడ్లమీదకు
అమెరికా సూపర్ సోనిక్ ఆయుధాన్ని వాడి ఉంటుందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్నాయి. టార్గెట్‌ను ధ్వంసం చేసేందుకు మైక్రోవేవ్స్ లేదా లేజర్స్‌ను వాడినట్లు తెలుస్తోందని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ సభ్యుడు ఒకరు చెప్పారు. ఇలాంటి ఆయుధాలు అమెరికా వద్ద ఎన్నో ఏళ్లుగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఆయుధాలు ప్రయోగిస్తే రక్తస్రావం, భరించలేని నొప్పి, ముందుకు కదలలేని స్థితి వంటి పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో భారత్ సైనికులపై కూడా చైనా ఇలాంటి మైక్రోవేవ్ ఆయుధాలు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020లో లడఖ్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చెలరేగినప్పుడు చైనా ఇలాంటి ఆయుధాలు వాడినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాదనలను చైనా కొట్టేసింది.
మరోవైపు వెనెజువెలా లాంటి చిన్న దేశంపై సూపర్ సోనిక్ ఆయుధాలు వాడి అమెరికా మరోసారి తన సైనిక శక్తిని నిరూపించినట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగ్ ఇచ్చేందుకే వైట్‌హౌస్ సెక్రటరీ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసినట్లు భావిస్తున్నారు.
సోనిక్ ఆయుధం అంటే ఏంటి?
సాధారణంగా ఆయుధాలు అంటే చాలామంది తుపాకులు లేదా క్షిపణులు అని అనుకుంటారు. కానీ సోనిక్ ఆయుధాలు అలా ఉండవు. ఇవి ధ్వని తరంగాలను వినియోగించి మనుషులను శారీరకగా ఇబ్బంది పెడతాయి. వీటిని "ధ్వని ఫిరంగులు" అని కూడా పిలుస్తారు. ఇవి మనిషి భరించలేనంత గరిష్ట స్థాయి డెసిబెల్స్‌తో కూడిన శబ్దాన్ని విడుదల చేస్తాయి. సాధారణంగా దీన్ని ప్రాణాలు తీయడానికి కాకుండా, ఒక గుంపును చెదరగొట్టడానికి లేదా ఎదుటి వ్యక్తిని తాత్కాలికంగా కదలకుండా చేసేందుకు ఈ ఆయుధాలను వినియోగిస్తారు. దీని నుంచి వచ్చే భారీ శబ్దాల వల్ల తీవ్రమైన తలనొప్పి, వికారం, చెవుల నుంచి రక్తం కారడం, వినికిడి శక్తి కోల్పోవడం, విపరీతమైన భయం లాంటివి కలుగుతాయి.ఈ సోనిక్ ఆయుధాన్ని నౌకాదళాల్లో సముద్రపు దొంగలను తరిమికొట్టేందుకు.. అలాగే అల్లర్ల సమయంలో జనాన్ని నియంత్రించేందుకు వాడుతుంటారు.
Also Read: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..
అమెరికా మదురోను అదుపులోకి తీసుకునేందుకు సోనిక్ ఆయుధాన్ని వాడినట్లు అధికారికంగా చెప్పలేదు. కానీ వెనెజువెలా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు చూస్తే అమెరికా సైన్యం అత్యాధునిక సోనిక్ ఆయుధాన్ని వాడినట్లు తెలుస్తోంది. మరోవైపు వైట్‌హౌస్ సెక్రటరీ కూడా వెనెజువెలా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడంతో వాళ్లు సోనిక్ ఆయుధాన్ని వాడారని స్పష్టమవుతోంది.
Follow Us