ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..

బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా ఈవోఎస్-ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.

New Update
FotoJet - 2026-01-12T115325.050

The PSLV-C62 mission encountered an anomaly during end of the PS3 stage.

ISRO PSLV-C62: బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో.. కొత్త సంవత్సరం విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ ఉదయం 10.18 గంటలకు పీస్‌ఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టింది(ISRO live launch).  తాజా మిషన్ కింద PSLV-C62 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-N1ని ప్రధాన పేలోడ్‌గా కక్ష్యలో పంపింది. దీంతో పాటు మొత్తం 15 ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లాంచ్ ప్యాడ్-1 నుండి EOS-N1 ఉపగ్రహాన్ని PSLV-C62 వాహక నౌక ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఇది 64వ PSLV రాకెట్ అయితే ఇది PSLV-DL వేరియంట్ నుండి ఉంటుంది. ఇందులో పేలోడ్‌ను 505 కిలోమీటర్ల సన్-సింక్రోనస్ కక్ష్యలో ఉంచుతారు. 

ఈ రాకెట్‌ ద్వారా 1,485 కిలోల బరువున్న ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో రోదసిలోకి పంపనుంది. రాకెట్‌ పైకి ఎగిరి 4దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్‌ శిఖర భాగాన ఉన్న ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యనువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం 15 బుల్లి ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు 10 సెకన్ల వ్యవధిలోనే కక్ష్యలోకి చేర్చనున్నారు. ఆపై రాకెట్‌లోని నాలుగో దశను రీస్టార్ట్‌ చేసి స్పెయిన్‌ దేశానికి చెందిన కిడ్‌ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్‌ స్టార్టప్‌ ఆర్బిటల్‌ పారాడైమ్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కాగా, డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈవోఎస్ -ఎన్‌1 ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు ‘అన్వేషణ్‌’గా నామకరణం చేశారు.: DRDO కోసం అభివృద్ధి చేసిన EOS-N1 ఉపగ్రహం లేదా అన్వేష రక్షణ రంగంలో అత్యంత కీలకపాత్ర పోషించనుంది. ఇది రక్షణ, వ్యవసాయం, పర్యావరణంపై ఫోకస్ చేయనుంది.

KID (Kestrel Initial Technology Demonstrator): స్పెయిన్ స్టార్టప్ కు చెందిన 25 కిలోల రీ-ఎంట్రీ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్, తుది విస్తరణ తర్వాత దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్‌తో తిరిగి ప్రవేశాన్ని పరీక్షిస్తారు.భారతదేశంతో పాటు మారిషస్, లక్సెంబర్గ్, UAE, సింగపూర్, యూరప్, అమెరికాకు చెందిన అనేక వాణిజ్య,  పరిశోధనా ఉపగ్రహాలు ఈ మిషన్‌లో భాగంగా ఉన్నాయి. - ISRO latest news

Also Read :  బెంగళూరు టెకీ మృతి కేసులో సంచలనం.. లైంగిక దాడికి యత్నించి..

FotoJet - 2026-01-12T115909.186

PSLV ని ISRO యొక్క వర్క్ హార్స్‌గా పరిగణిస్తారు. ఇప్పటివరకు 63 వాహక నౌకలలో, ఈ రాకెట్ చంద్రయాన్-1, మంగళ్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య-ఎల్1 వంటి చారిత్రక మిషన్లను విజయవంతంగా నిర్వహించింది. 2017లో ఒకే మిషన్‌లో 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రపంచ రికార్డు కూడా PSLV సొంతం చేసుకుంది. అయితే, గత ఏడాది మే నెలలో PSLV-C61 మిషన్ విఫలమైందని తెలిసిందే. తాజాగా చేస్తున్న ఈ ప్రయోగం ISROకి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మిషన్ మొత్తం వ్యవధి దాదాపు 1 గంట 48 నిమిషాలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఆ ఉపగ్రహాల ఉపయోగాలు ఇవే..

ఇస్రో ప్రయోగించిన PSLV-C62 ద్వారా నింగిలోకి వెళ్లిన EOS-N1 ఉపగ్రహం భారతదేశ రక్షణ, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇది సాధారణ కెమెరాల కన్నా భిన్నంగా కాంతిలోని వందలాది షేడ్స్‌ను విశ్లేషించే 'హైపర్‌స్పెక్ట్రల్' సాంకేతికతతో పనిచేస్తుంది. దీనివల్ల భూమిపై పచ్చదనం, నేలలోని తేమనే కాకుండా శత్రువుల నకిలీ స్థావరాలను, అడవుల్లో దాగి ఉన్న అనుమానాస్పద కదలికలను కూడా ఖచ్చితంగా గుర్తించవచ్చు.రైతులకు పంట తెగుళ్లు, కరువు ముప్పును ముందస్తుగా తెలపడంతో పాటు తుఫానులు, అడవి మంటల వంటి విపత్తుల విషయంలో ఈ ఉపగ్రహం కీలకంగా మారుతుంది. ఈ ప్రయోగంలో భారత్‌తో పాటు యూరప్, బ్రెజిల్, నేపాల్ వంటి దేశాల ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపారు.

FotoJet - 2026-01-12T115630.644

Also Read :  యువతకు దిశానిర్దేశం.. వివేకానంద బోధనలు

ప్రయోగంలో అంతరాయం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది(isro-exam-cancelled). దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘ఈఓఎస్‌-ఎన్‌1’ లేదా ‘అన్వేష’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్‌లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) ఛైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. ప్రయోగం మూడో దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అయితే సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 10.18 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ‘ఈఓఎస్‌-ఎన్‌1’తో పాటు భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్, థాయ్‌లాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్‌ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా మోసుకెళ్లింది. అయితే, వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. 2026లో ఇస్రో (ISRO) చేపట్టిన తొలి ప్రయోగం ఇదే.

Advertisment
తాజా కథనాలు