Stock Market: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది. 

New Update
stock market today

stock market today

చాలా రోజుల నుంచీ భారత స్టాక్ మార్కెట్లు భయంతో కూరుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 500 శాం సుంకాలు విధిస్తానని చెప్పడమే ఇందుకు కారణం. ఈరోజు కూడా ఇదే భయంతో సూచీలు మొదలయ్యాయి. దానికి తోడు విదేశీ మదుపర్లు ఈరోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. దీంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ మొదలైంది. దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. 25,500 కిందకు నిఫ్టీ వెళ్ళిపోయాయి. కానీ చివరి గంటలో మొత్తం అంతా తారుమారు అయిపోయింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ మళ్ళీ వాణిజ్య చర్చలుంటాయని చేసిన వ్యాఖ్యలు మదుపర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో లాభాలతో మార్కెట్ ముగిసింది. 

అంతా బావుంటుంది..

భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. దీని తరువాత ఆయన మిత్రులన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనవరి 13న ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు ఉంటాయని చెప్పారు. ఇది మార్కెట్ కు బూస్ట్ ను ఇచ్చింది. దీంతోపాటు సిలికాన్‌ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో వ్యూహాత్మకంగా ఏర్పాటైన ప్యాక్స్‌సిలికాన్‌ కూటమిలోకి భారత్‌ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పడం కూడా హెల్ప్ అయింది. దీంతో గత ఐదు రోజులుగా నష్టాలతో ఈదులాడుతున్న స్టాక్ మార్కెట్ ఈరోజు ఒడ్డెక్కింది. సెన్సెక్స్‌ కనిష్ఠాల నుంచి దాదాపు 1100 పాయింట్ల మేర రికవర్‌ అయ్యింది. సెన్సెక్స్ 302 పాయింట్లు పెరిగి 83,878 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 107 పాయింట్లు పెరిగి 25,790 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 24 లాభపడ్డాయి. ఇంధనం, మెటల్, బ్యాంకింగ్ స్టాక్‌లు పెరిగాయి.. రియాలిటీ, ఆటో, మీడియా,  ఫార్మాస్యూటికల్ స్టాక్‌లు క్షీణించాయి. టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ట్రెంట్‌, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 90.16గా ఉంది.

ప్రపంచ మార్కెట్లలో జోరు

మరోవైపు ప్రపంచ మార్కెట్లు సైతం ఈ రోజు లాభాలతో ముగించాయి. ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 0.84% ​​పెరిగి 4,624 వద్ద ముగిసింది, జపాన్ నిక్కీ ఇండెక్స్ ఈరోజు ముగిసింది.హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.44% పెరిగి 26,608 వద్ద ముగిసింది, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.09% పెరిగి 4,165 వద్దకు చేరుకుంది.
జనవరి 9న, US డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.48% పెరిగి 49,504 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.81% లాభపడింది. S&P 500 0.65% లాభపడింది.

Advertisment
తాజా కథనాలు