అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 538కి చేరింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Iran warns it will retaliate if US attacks

Iran warns it will retaliate if US attacks

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 538కి చేరింది. వీళ్లలో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరో 10,670 మంది నిరసనాకారులను సైన్యం అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఇరాన్‌లో నిరసనలకు అమెరికా సపోర్ట్ చేస్తోంది. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో పలు ప్రతిపాదనలు కూడా ట్రంప్ ముందున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇరాన్‌పై అమెరికా డైరెక్ట్‌గా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మరో అధికారి తెలిపారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ట్రంప్ కచ్చితంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇరాన్‌ కూడా అమెరికాను హెచ్చరిస్తోంది.  ఒకవేళ అమెరికా.. ఇరాన్ భూభాగంపై దాడులు చేస్తే, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ కాలిబాఫ్ వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: రక్తం కక్కుకున్న వెనెజువెలా సైనికులు.. మదురోను తీసుకెళ్లేందుకు అమెరికా వాడిన సీక్రెట్‌ వెపన్ ఏంటో తెలుసా ?

మరోవైపు ఇరాన్‌లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి  తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఆందోళనకారుల నిరసనల వల్ల తమ దేశం అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ట్రంప్‌కు ఓ సాకు దొరికిందంటూ తీవ్రంగా విమర్శించారు. అమెరికా ఒకవేళ ఇరాన్‌పై దాడులు చేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అమెరికా బలం 

అమెరికా, ఇరాన్ దేశాల సైనిక బలాన్ని పోల్చి చూస్తే.. సాంకేతికంగా, ఆర్థికంగా అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. క్షిపణలు, డ్రోన్లు కలిగిఉన్న ఇరాన్ 16వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌ అమెరికాకు ఉంది. F-22, F-35 వంటి అత్యాధునిక 'స్టెల్త్' యుద్ధ విమానాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాకు సంబంధించి 750కి పైగా సైనిక స్థావరాలు ఉన్నాయి.  దీనివల్ల ఏ క్షణంలోనైనా ఎక్కడైనా దాడి చేయగలిగే సామర్థ్యం ఈ దేశానికి ఉంది. సైబర్ వార్‌ఫేర్, స్పేస్ ఫోర్స్ అలాగే అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీలో వీళ్లకు తిరుగులేదు. అమెరికా వద్ద సుమారు 5,100 నుండి 5,200 వరకు అణు ఆయుధాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,770 అణు వార్‌హెడ్‌లు ఎప్పుడైనా ప్రయోగించేందుకు రెడీగా ఉన్నాయి. 

Also Read: రెనీ నికోలో గుడ్‌ కు సంఘీభావం...వేలాదిమంది రోడ్లమీదకు

ఇరాన్ బలం

పశ్చిమాసియాలో అత్యధిక సంఖ్యలో, అత్యంత శక్తివంతమైన క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఈ దేశం నేరుగా యుద్ధం చేయకుండా గెరిల్లా దాడులు, డ్రోన్ దాడులతో పాటు తన మిత్ర దేశాల్లోని హెజ్‌బుల్లా, హౌతీస్ లాంటి గ్రూపుల ద్వారా అమెరికాను ఇబ్బంది పెట్టగలదు. హోర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ కంట్రోల్‌లోనే ఉంది. దీని ద్వారా జరిగే చమురు రవాణాను అడ్డుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి అణు బాంబులు లేవు. మొత్తంగా చూసుకుంటే ఇరాన్ కన్నా అమెరికా వద్దే బలమైన సైన్యం ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్‌తో యుద్ధానికి దిగితే అమెరికాకు కూడా భారీ నష్టం కలగవచ్చు. 

Advertisment
తాజా కథనాలు