Telangana Police: మొన్న 77 మంది డీఎస్పీలు.. నేడు 33 మంది ఏఎస్పీలు.. పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు!
తెలంగాణలో 30 మంది అడిషనల్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉంది.